Shocking : డబ్బుల కోసం..8 డోసుల వ్యాక్సిన్ తీసుకున్న యువకుడు

డబ్బుల కోసం.. ఓ యువకుడు ఏకంగా 8 డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నాడు. తొమ్మిదవసారి వ్యాక్సిన్ వేయించుకోవటానికి వెళ్లగా పట్టుబడ్డాడు.

Shocking : డబ్బుల కోసం..8 డోసుల వ్యాక్సిన్ తీసుకున్న యువకుడు

One Man 8 Times Vaccination

Covid-19 Vaccination: కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి సంవత్సరం అవుతోంది. అయినా ఈనాటికీ వ్యాక్సిన్ వేయించుకోవటానికి చాలామంది ఇష్టపడటంలేదు. కానీ ఓ వ్యక్తి మాత్రం ‘‘వ్యాక్సిన్ అంటే చాలు నేను వేయించుకుంటా..నేను వేయించుకుంటా’’ అంటూ తెగ ఉత్సాహం చూపిస్తున్నాడు. అలా ఒకటి రెండు కాదు ఏకంగా ఎనిమిదిసార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడు. తొమ్మిదోసారి వేయించుకోబోతుండగా గుట్టు బయటపడింది. అతను ఎందుకు అన్నిసార్లు వ్యాక్సిన్ వేయించుకుంటున్నాడంటే..డబ్బుల కోసం..డబ్బుల కోసమా? వ్యాక్సిన్ వేయించుకుంటే ప్రభుత్వ డబ్బులిస్తోందా? అనే డౌట్ వస్తుంది. కానీ అతను వ్యాక్సిన్ వేయించుకుంటే డబ్బులు ఇస్తున్నారు. కానీ ప్రభుత్వం కాదు..వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఇష్టపడని కొంతమంది..

Read more : Covid Vaccine : 24 గంటల్లో 10 సార్లు కొవిడ్‌ వ్యాక్సిన్లు వేయించుకున్న వ్యక్తి..నిర్దారించిన ఆరోగ్యశాఖ

బెల్జియంలోని వాలూన్ ప్రావిన్స్‌లోని చార్లెరోయ్ నగరంలో ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి రావటంతో వైద్య సిబ్బంది షాక్ అయ్యారు. ఓ యువకుడు వ్యాక్సిన్ తీసుకోకుండా సర్టిఫికెట్ పొందాలనుకునే వారు ఎవరో తెలుసుకుని మరీ వారిని సంప్రదిస్తున్నాడు. వారి నుంచి డబ్బులు తీసుకుని వారికి బదులుగా తానే వ్యాక్సిన్ వేయించుకుంటున్నాడు. వ్యాక్సిన్ వేయించుకున్నాక..అతను టీకా ధృవీకరణ పత్రాన్ని సదరు వ్యక్తులకు ఇచ్చేవాడు. దీంతో వారు వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా నిర్ధారణ అవుతుంది.

అది వారికి ఉద్యోగాలకు కావచ్చు..లేదా మరే కారణాలకైనా కావచ్చు. వారికి వ్యాక్సిన్ వేయించుకోవటం ఇష్టం లేదు. కానీ వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా సర్టిఫికెట్ కావాలి. అలా సదరు యువకుడు అటువంటివారిని వెతికి పట్టుకోవటం వ్యాక్సిన్ వేయించుకోవటం..తరువాత వ్యాక్సిన్ సర్టిఫికెట్ వారికి ఇవ్వటం ఇదే పనిగా పెట్టుకున్న సదరు యువకుడు అలా ఒకటి రెండు కాదు ఏకంగా ఎనిమిదిసార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడు.

Read more : India : ఒమిక్రాన్ టెన్షన్..భారతదేశంలో మళ్లీ ఆంక్షలు..ఏ రాష్ట్రంలో ఎలా

అలా సదరు వ్యక్తి తొమ్మిదోసారి వ్యాక్సిన్ వేయించుకోవటానికి వచ్చినప్పుడు గుట్టు బయటపడింది. దీంతో వైద్య సిబ్బంది అతడిని పోలీసులకు అప్పగించారు. కానీ అతను ఎనిమిది సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నా అతనికి ఎటువంటి సమస్యలు రాలేదు.ఎనిమిది డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ అతని శరీరంలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. ప్రస్తుతం అతడిని అబ్జర్వేషన్‌లో ఉంచి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా..Omicron ముప్పు ఉన్న బెల్జియంలో దీని నివారించే యత్నంలో భాగంగా డిసెంబర్ 26 నుండి ఇండోర్ మార్కెట్‌లు, సినిమాహాళ్లు, థియేటర్లు మరియు కచేరీ హాళ్లు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే స్కూల్స్ మూసివేశారు. కరోనా నియంత్రణలోకి వస్తే, జనవరి 10, 2022 నుండి తిరిగి తెరవబడతాయని బెల్జియన్ ప్రధాన మంత్రి అలెగ్జాండర్ డి క్రూ తెలిపారు.

Read more : Mizoram : క్రైస్తవుల సంఖ్య పెరగాలి..పిల్లల్ని కనటానికి ప్రభుత్వం మహిళలకు మెటర్నిటి సెలవులు ఇవ్వాలి