India : ఒమిక్రాన్ టెన్షన్..భారతదేశంలో మళ్లీ ఆంక్షలు..ఏ రాష్ట్రంలో ఎలా

కరోనా ప్రవర్తనా నియమావళి కచ్చితంగా పాటించాలని రాష్ట్రాలు ఆదేశించాయి. కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి.

India : ఒమిక్రాన్ టెన్షన్..భారతదేశంలో మళ్లీ ఆంక్షలు..ఏ రాష్ట్రంలో ఎలా

Omicron (3)

Indian Omicron : ఊహించినట్టే భారత్‌ ఒమిక్రాన్ హబ్‌గా మారుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసి బ్రిటన్, అమెరికాను వణికిస్తోన్న వేరియంట్.. ఇప్పుడు భారత్‌ను బెంబేలెత్తిస్తోంది. కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ఒక్కరోజులోనే రికార్డుస్థాయిలో కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ మొత్తం కేసుల సంఖ్య నాలుగు వందలకు చేరువయింది. మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణలో ఒమిక్రాన్ విజృంభిస్తోంది. దేశంలో వేరియంట్ వ్యాప్తి మూడోదశకు చేరింది. వైరస్ బాధితుల నుంచి సమూహాలకు వ్యాపించే.. దశను మూడోదశ.. సామూహిక వ్యాప్తి దశగా భావిస్తారు. దీంతో క్రిస్మస్, న్యూ ఇయర్ లను దృష్టిలో ఉంచుకుని పలు రాష్ట్రాలు ఆంక్షల వలయంలోకి వెళ్లిపోతున్నాయి.

తెలంగాణలో : –
తెలంగాణలో క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలపై.. సందిగ్ధత కొనసాగుతోంది. ఆంక్షల అంశం తెరపైకి వచ్చింది. ఒమిక్రాన్‌ టెన్షన్‌ పెడుతుండటంతో.. వేడుకలు వద్దని.. ఆంక్షలు పెట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను తెలంగాణ సర్కార్‌ గౌరవిస్తామంటోంది. కేబినెట్‌ భేటీ తర్వాత.. ఆంక్షలపై కేసీఆర్‌ సర్కార్‌ ఓ ప్రకటన చేయనుంది.

Read More : Online marriage : ఆన్‌లైన్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేరళ హైకోర్టు..ఎందుకంటే..

ఢిల్లీలో : –

దేశ రాజధాని ఢిల్లీలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలపై కేజ్రీవాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. వేడుకలను సామూహికంగా జరుపుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ లు ధరించని వారిని అనుమతించవద్దని వాణిజ్య సంస్థలకు సూచించింది. బార్ లు, రెస్టారెంట్ లలో 50 సిటింగ్ సామర్థ్యంతో అనుమతించనున్నారు. వివాహాలు, అంత్యక్రియలకు మాత్రం 200 మందికంటే అధికంగా ఉండొద్దని స్పష్టమైన ఆదేశాలున్నాయి.

Read More : Omicron Cases : దేశవ్యాప్తంగా 358 ఒమిక్రాన్ కేసులు..17 రాష్ట్రాల్లో వేరియంట్

ముంబాయిలో : –

వాణిజ్య నగరంగా పేరొందిన ముంబాయి నగరంలో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వేడుకలు, సమావేశాలను 50 శాతం ఆక్యుపెన్సీతో నిర్వహించుకోవాలని, 200 మంది కన్నా ఎక్కువ హాజరవుతుంటే..ఉన్నతాధికారుల అనుమతి తప్పనసరిగా తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. డిసెంబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. వ్యాక్సినేషన్ పూర్తయిన వారికే ప్రజా రవాణా సంస్థలు ప్రయాణానికి అనుమతించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం.

Read More : Omicron Variant : దేశంలో కొత్తగా 6,650 కరోనా కేసులు, క్రమంగా పెరుగుతున్న ఒమిక్రాన్ బాధితులు

గుజరాత్ లో : –

గుజరాత్ రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో ఈ నెలాఖరు వరకు రాత్రి పూట కర్ఫ్యూని పొడిగించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31 వరకు రాత్రి వేళ కర్ఫ్యూ అమలు చేయనున్నారు. అహ్మదాబాద్, రాజ్ కోట్, సూరత్, గాంధీనగర్, జామ్ నగర్, భవ్ నగర్, జునాగఢ్ లలో అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. 75 శాతం సామర్థ్యంతో రెస్టారెంట్లు, 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు పని చేసేందుకు అనుమతినిచ్చింది.

Read More : AP Omicron : బ్రేకింగ్ న్యూస్..ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో : –
కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండడంతో మధ్యప్రదేశ్ అలర్ట్ అయ్యింది. నైట్ కర్ఫ్యూ విధించింది. 2021, డిసెంబర్ 24వ తేదీ శుక్రవారం నుంచి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 05 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. అయితే..ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ లో ఒక్క ఒమిక్రాన్ కేసు నమోదు కాకపోవడం గమనార్హం.

Read More : Allahabad High Court : అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడుతాయా ? అలహాబాద్ హైకోర్టు కీలక సూచనలు

హర్యానాలో :

హర్యానా రాష్ట్రంలో పలు ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. కోవిడ్ టీకాలు వేసుకోని వారిని జనవరి 01వ తేదీ నుంచి బహరింగప్రదేశాల్లో అనుమతించకూడదని నిర్ణయించింది. జనవరి 01వ తేదీ నుంచి రెండో డోసును తప్పనిసరి చేసింది. సినిమా థియేటర్లు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, జిమ్, ఫిట్ నెస్ సెంటర్లు, పార్కులలో రెండో డోస్ తీసుకున్న వారిని మాత్రమే అనుమతించాలని ఆదేశించింది. 18 ఏళ్లు పైబడిన విద్యార్థులందరికీ టీకాలు తప్పనిసరని పేర్కొంది.

Read More : Corona Restrictions : తెలంగాణలో మరోసారి కరోనా ఆంక్షలు ? క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకలపై సస్పెన్స్‌

కర్నాటకలో : –

ఈ రాష్ట్రంలో కూడా పలు ఆంక్షలు అమలు కానున్నాయి. నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 02వ తేదీ వరకు బహిరంగ ప్రదేశాల్లో సామూహిక కార్యక్రమాలు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేసింది. పబ్ లు, రెస్టారెంట్లు, అపార్ట్ మెంట్ లలో డీజీలు వినియోగించరాదని పేర్కొంది. 50 శాతం సామర్థ్యంతో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకోవచ్చని, డీజేలతో పార్టీలు చేసుకోరాదని వెల్లడించింది. రెండు డోసుల టీకా తీసుకోని వారిని పబ్ లు, రెస్టారెంట్ లలోకి అనుమతించొద్దని సూచించింది.

Read More : Covid-19 cases In Mumbai : ముంబైని కమ్మేస్తున్న కరోనా..23కొత్త ఒమిక్రాన్ కేసులు

క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల తరుణంలో.. కరోనా ప్రవర్తనా నియమావళి కచ్చితంగా పాటించాలని రాష్ట్రాలు ఆదేశించాయి. కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి. రానున్న రోజుల్లో ఒమిక్రాన్ కేసుల విషయంలో భారత్, బ్రిటన్, అమెరికాను దాటిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు.