Allahabad High Court : అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడుతాయా ? అలహాబాద్ హైకోర్టు కీలక సూచనలు

ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు కారణంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసే ఆలోచనలు చేయాలని సూచించింది. ఈ అసెంబ్లీ ఎన్నికలను మరో నెల లేదా.. రెండు నెలలు...

Allahabad High Court : అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడుతాయా ? అలహాబాద్ హైకోర్టు కీలక సూచనలు

Five States

Five Staes Election 2022 : ఒమిక్రాన్‌ ముప్పు పొంచి ఉన్న సమయంలో వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆందోళనలు పెంచుతున్నాయి. దీంతో అలహాబాద్‌ హైకోర్టు ప్రధాని మోదీ, ఎన్నికల సంఘానికి కీలక సూచనలు చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు కారణంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసే ఆలోచనలు చేయాలని సూచించింది. ఈ అసెంబ్లీ ఎన్నికలను మరో నెల లేదా.. రెండు నెలలు వాయిదా వేయాలని కోరింది. కరోనా కేసులు పెరగకుండా.. మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అలాగే, ర్యాలీలు, రాజకీయ సభలు, కార్యక్రమాలపై నిషేధం విధించాలని కోరింది. ఎన్నికల కోసం ప్రచారం చేయాలనుకుంటే రాజకీయ పార్టీలు టీవీలు, న్యూస్ పేపర్లనూ ఎంచుకోవచ్చని తెలిపింది. ప్రాణాలు ఉంటేనే మిగతా అంతా కూడా అంటూ ఈ అంశాలు పరిగణనలోకి తీసుకోవాలని కోరింది అలహాబాద్ హైకోర్టు. ఓ బెయిల్‌ పిటిషన్‌పై విచారిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేసింది.

Read More : Corona Restrictions : తెలంగాణలో మరోసారి కరోనా ఆంక్షలు ? క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకలపై సస్పెన్స్‌

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు వచ్చే ఏడాది తొలినాళ్లలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల తుది తేదీలను ఎలక్షన్ కమిషన్ జనవరి మూడో వారంలో వెలువరించనుంది. మార్చి మధ్యలో ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభణ కూడా అదే సమయంలో పీక్‌ స్టేజ్‌లో ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో అలహాబాద్‌ కోర్టు ఎన్నికలు వాయిదా వేయాలని సూచించింది.

Read More : Crime News : నల్గొండ జిల్లాలో దారుణం.. ఇద్దరు కొడుకులను చంపి.. తండ్రి ఆత్మహత్య

ఇటీవలే ఓ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఏబీపీ న్యూస్ – సీఓటర్-ఐఏఎస్ఎన్ ఓ సర్వే నిర్వహించింది. అందులో ఈ సర్వేలో పంజాబ్ మినహా మిగతా అన్ని చోట్ల బీజేపీ విజయం సాధించనున్నట్లు వెల్లడైంది.

Read More : Omicron Wave : దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ తగ్గుముఖం ?

యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్నాయి. బీజేపీ 217 స్థానాల్లో విజయం సాధించి అధికారం నిలుపుకుంటుందని సర్వే తెలిపింది.
పంజాబ్ ఆమ్ ఆద్మీ అతిపెద్ద పార్టీగా నిలవనున్నట్లు పేర్కొంది. 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ 51 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వేలో తేలింది..
గోవా..40 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 21 చోట్ల విజయం సాదిస్తుందని సర్వేలో వెల్లడైంది.
ఉత్తరాఖండ్‌లో 70 స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 36 స్థానాలు కావాల్సి ఉండగా.. బీజేపీ 38 చోట్ల విజయం సాధిస్తుందని సర్వే తెలిపింది.
మణిపూర్‌…60 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 27 చోట్ల విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది.