Online marriage : ఆన్‌లైన్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేరళ హైకోర్టు..ఎందుకంటే..

బ్రిటన్ లో వరడు. కేరళలో వధువు. వీరిద్దరు ఆన్ లైన్ వివాహానికి కేరళ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Online marriage : ఆన్‌లైన్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేరళ హైకోర్టు..ఎందుకంటే..

Kerala High Court Allows Online Marriage

Kerala High Court Allows Online marriage : ఈరోజుల్లో ఎన్నో రకాల వివాహాలు జరుగుతున్నాయి. ఈక్రమంలో కేరళ హైకోర్టు ఆన్ లైన్ వివాహాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇంకేంటీ కరోనా..ఈ కరోనా రోజుల్లో వింత వింతగా వివాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వధువరులు వేరే వేరే దేశాల్లో ఉంటే వారు ఆన్ లైన్ లో వివాహాలు చేసుకోవటంకూడా జరుగుతోంది. ఈక్రమంలో కోర్టే ఓ జంటకు ఆన్ లైన్ లో వివాహం చేసుకోవటానికి అనుమతి ఇచ్చింది.

Read more : Space Wedding : అంతరిక్షంలో వరుడు.. అమెరికాలో వధువు.. 18 ఏళ్లక్రితం అరుదైన పెళ్లి

ఆన్ లైన్ వివాహానికి రాష్ట్ర అత్యున్నత ధర్మాసనమే అనుమతి ఇవ్వటానికి కారణం కూడా ఈ కరోనా మహమ్మారే. కరోనా వల్ల ఎక్కడివారక్కడ గప్ చిప్ అన్నట్లుగానే..కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల అంతర్జాతీయ విమానాలు కూడా ఆగిపోయాయి. దీంతో బ్రిటన్ ఉన్న యువకుడికి కేరళలో ఉన్న అమ్మాయితో డిసెంబర్ 23న అంటే నిన్న వివాహం జరిగాల్సి ఉంది. ఈక్రమంలో బ్రిటన్ నుంచి వరుడు రావాల్సి ఉండగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో వచ్చే పరిస్థితి లేదు. దీంతో సదరు యువకుడు కేరళ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు అతనికి అనుమతి ఇచ్చింది.

Read more : NASA SpaceX’s : డైపర్లు వేసుకున్న వ్యోమగాములు..!! ఎందుకంటే

కేరళకు చెందిన 25 ఏళ్ల న్యాయవాది రింటు థామస్, అనంత కృష్ణన్ హరికుమార్ నాయర్‌లు డిసెంబర్ 23న పెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టాలనుకున్నారు. కానీ ఒమిక్రాన్ రూపంలో వచ్చిన కరోనా వైరస్ వారి వివాహాన్ని అడ్డుకుంది. బ్రిటన్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన నాయర్ బుధవారం (డిసెంబర్ 22,2021) కేరళకు రావాల్సి ఉంది. కానీ బ్రిటన్ లో ఒమిక్రాన్ కేసుల వల్ల ప్రయాణ ఆంక్షలు ఉండడంతో రాలేకపోయారు. దీంతో వీరి వివాహం ఆగిపోయింది.

Read more : Moon Tourism : హలో వస్తారా..చందమామపైకి టూర్..5 కంపెనీలతో నాసా ఒప్పందం

దీంతో రింటు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఆన్‌లైన్‌లో వివాహం చేసుకోవటానికి అనుమతి ఇవ్వాలని కోరారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం, తిరువనంతపురంలోని సబ్ రిజిస్ట్రార్‌లను ఆదేశాలు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. వధువు రింటు పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.నగరేశ్ దీనికి అంగీకరించారు. కరోనా సమయంలో ఆన్‌లైన్ వివాహాలకు అనుమతినిచ్చిన క్రమంలో ఇప్పుడు కూడా దానిని అమలు చేయవచ్చని తెలిపారు. వారి పెళ్లికి తగిన ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.