Space Wedding : అంతరిక్షంలో వరుడు.. అమెరికాలో వధువు.. 18 ఏళ్లక్రితం అరుదైన పెళ్లి

అంతరిక్షంలో వరుడు..అమెరికాలో వధువు..18 ఏళ్లకిత్రం సరిగ్గా ఇదే రోజున జరిగిన అరుదైన పెళ్లి అప్పటికీ ఇప్పటికీ అరుదైన వివాహంగా రికార్డుగా నిలిచింది.

Space Wedding : అంతరిక్షంలో వరుడు.. అమెరికాలో వధువు.. 18 ఏళ్లక్రితం అరుదైన పెళ్లి

Space Wedding

Space Wedding : నేటి ఆధునిక యుగంలో పెళ్లి రూపు రేఖలే మారిపోయాయి. ఒకప్పుడు వధువు, వరుడు,పెళ్లి పెద్దలు, బంధువులు,స్నేహితులు అందరి సమక్షంలో తాటి ఆకుల పందిరి వేసి మామిడి ఆకులు తోరణాలుగా కట్టి పచ్చని పందికి కింద వివాహాలు అంగరంగ వైభవంగా జరిగేవి. కానీ ఇది ఆధునిక కాలం. పురోహితుడే కాదు వధు వరూలు ఇద్దరూ వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నా వివాహాలు జరిగిపోతున్నాయి. దటీజ్ టెక్నాలజీ మ్యారేజ్. అనేలా ఉన్నాయి. అమెరికాలో వరుడు..అనకాపల్లిలో వధువు ఉంటే వివాహం జరిగిపోతుంది. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ ఓ వివాహం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. వధువు అమెరికాలో ఉంది. వరుడు అంతరిక్షంలో ఉండగా..అంటే గాల్లో ఉన్నాడు. వీరిద్దరికి వివాహం జరిగింది. అదీ కూడా ఇటీవల కాలంలో కాదు.ఎప్పుడో 18 ఏళ్ల క్రితం. అంటే 2003వ సంవత్సరంలో అయ్యిందీ వీడియో కాల్ పెళ్లి..సరిగ్గా 18 ఏళ్ల క్రితం ఇదే రోజున..

18 ఏండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున జరిగిన ఈ పెళ్లి ఇప్పటికీ ప్రత్యేకమైనదిగానే రికార్డుల్లో భద్రంగా ఉంది. అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్న రష్యన్‌ వ్యోమగామి యూరి మాలెన్‌చెంకో వివాహం ఆమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న కటారినా డిమిత్రివ్‌ను వివాహం చేసుకున్నారు. ప్రపంచంలో ఇలా అంతరిక్షం నుంచి వివాహం చేసుకున్న తొలి వ్యక్తిగా యూరి మాలెన్‌చెంకో నిలిచారు. రష్యాకు చెందిన యూరి గగారిన్ 1961 ఏప్రిల్ 12 న అంతరిక్షంలోకి అడుగుపెట్టిన ప్రపంచంలో తొలి మానవుడు. గగారిన్ సాధించిన ఈ వార్షికోత్సవం సందర్భంగా 2003 లో ఒక పార్టీ జరిగింది. ఇక్కడే యూరి మాలెన్‌చెంకో, కటారినా డిమిత్రివ్‌ చూపులు కలిశాయి. అనంతరం 2003 ఏప్రిల్‌ నెలలో నిర్వహించిన రష్యా ఎక్స్‌పెడిషన్‌-7 లో యూరి మాలెన్‌చెంకో అంతరిక్షంలోకి వెళ్లారు. మిషన్ నుంచి తిరిగి రాగానే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

మిషన్‌కు వెళ్లడానికి ముందే డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. అదే ఆగస్టు 10 అని. అయితే, ఆగస్ట్‌ మొదటివారంలో పూర్తికావాల్సిన మిషన్.. అక్టోబర్ వరకు పొడిగించాల్సి వచ్చింది. అంటే వివాహం తేదీ దాటి. కానీ ముందే నిర్ణయించుకున్నట్లుగా వీరిద్దరి వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఇరు కుటుంబాలవారు. దీంతో వివాహం వాయిదా వేసుకోవటానికి ఇష్టపడలేదు. ఏమైనా సరే అనుకున్న డేటుకే వివాహం జరగాలనుకున్నారు. యూరి మాలెన్‌చెంకో తన ప్రేయసిని అంతరిక్షం నుంచే వివాహం చేసుకోవాలనుకున్నాడు. రష్యా నిబంధనల ప్రకారం వివాహానికి వధూవరులు ఇద్దరూ ఉండాల్సిందే. అయితే, కటారినా చాలా కాలంగా అమెరికాలోని టెక్సాస్‌లో నివసిస్తోంది. కానీ టెక్సాస్‌ నిబంధనల ప్రకారం ఇద్దరూ పెండ్లికి హాజరుకావాల్సిన అవసరం లేదు.

దీనికి నాసా కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతరిక్ష కేంద్రానికి వ్యక్తిగత విషయాలకు వాడుకోవడానికి వీల్లేదంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారింది. వీరి పెండ్లిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపింది. కానీ ఆఖరికి నాసా అనుతించక తప్పలేదు. చివరికి వీరి వివాహానికి అన్ని ఆటంకాలు తొలిగిపోయి..వీడియో కాల్‌ ద్వారా ఇద్దరు పెళ్లి ప్రమాణాలు చేసుకొని ఒక్కటయ్యారు. ప్రపంచంలో ఇదే తొలి, చివరి పెండ్లిగా నిలిచిపోనుంది. ఈ పెండ్లి తర్వాత అంతరిక్ష సంస్థలు ఇలాంటి వ్యక్తిగత పనుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని వినియోగించుకోవడంపై నిషేధం విధించాయి.