Omicron Cases : దేశవ్యాప్తంగా 358 ఒమిక్రాన్ కేసులు..17 రాష్ట్రాల్లో వేరియంట్

కొత్తగా ఇతర రాష్ట్రాలకు ఒమిక్రాన్ విస్తరిస్తోంది. అగ్రస్థానంలో మహారాష్ట్ర, తర్వాత స్థానాల్లో ఢిల్లీ , తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌, కేరళ, కేరళ, రాజస్థాన్‌ లు ఉన్నాాయి.

Omicron Cases : దేశవ్యాప్తంగా 358 ఒమిక్రాన్ కేసులు..17 రాష్ట్రాల్లో వేరియంట్

India (2)

Omicron cases registered in india : ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ భారత్ నూ కలవర పెడుతోంది. దేశంలో భారీగా ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 358 కు చేరింది. ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా ఇతర రాష్ట్రాలకు ఒమిక్రాన్ వేరియెంట్ విస్తరిస్తోంది. ఒమిక్రాన్ కేసులలో అగ్రస్థానంలో మహారాష్ట్ర, తర్వాత స్థానాల్లో ఢిల్లీ , తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌, కేరళ, రాజస్థాన్‌ లు ఉన్నాయి.

మహారాష్ట్రలో 88, ఢిల్లీలో 67, తెలంగాణ లో 38 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడులో 34, కర్ణాటకలో 31, గుజరాత్ లో 30, కేరళలో 27, రాజస్థాన్ 22, హర్యానా 4, ఒడిశా 4, జమ్మూకాశ్మీర్ 3, పశ్చిమ బెంగాల్ 3 ఉత్తరప్రదేశ్ 2, ఏపీలో 2, లద్దాఖ్ 1, చండిఘడ్ 1, ఉత్తరాఖండ్ 1 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు చేశారు. కాగా ఇప్పటి వరకు భారత్ లో ఒమిక్రాన్ నుంచి 114 మంది కోలుకున్నారు.

Corona Restrictions : తెలంగాణలో మరోసారి కరోనా ఆంక్షలు ? క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకలపై సస్పెన్స్‌

ప్రపంచదేశాలను కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. కొత్త వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. రోజు రోజుకూ ఒమిక్రాన్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. జర్మనీలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు అయింది. ఇప్పటికే బ్రిటన్, అమెరికా, ఇజ్రాయెల్ లో ఒమిక్రాన్ మరణాలు సంభవించాయి. జర్మనీలో ఇప్పటివరకు 3,198 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య లక్ష దాటిపోయింది. డిసెంబర్ 23న బ్రిటన్‌లో ఒక్కరోజే 15వేల 363 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. బ్రిటన్‌లో ఇప్పటివరకు 40 వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు బ్రిటన్ లో ఇప్పటివరకు నమోదయ్యాయి. అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది.

Omicron Death : జర్మనీలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు

ఇప్పటికే వైరస్ ప్రబలంగా ఉన్న కొవిడ్ డెల్టా వైరస్‌పై ఒమిక్రాన్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. డెల్టా కొవిడ్ కేసుల కంటే ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం.. యుఎస్‌లో సీక్వెన్స్ అయిన కోవిడ్-19 కేసులలో ఒమిక్రాన్ వేరియంట్ 73శాతం వాటాను కలిగి ఉంది. గత వారం నుంచి 3శాతంగా కేసులు పెరిగాయి.

అమెరికాలో కేసుల సంఖ్య 15వందలని అధికారికంగా ప్రకటించినా కొత్త కేసుల్లో 70శాతానికి పైగా ఒమిక్రానే అంటున్నారు. అక్కడ రోజుకు లక్షకు పైగా కేసులు వస్తున్నాయి. ఆ లెక్కన ఒమిక్రాన్ కేసులు వేలల్లో ఉండాలి. అయితే అధికారికంగా ఆ లెక్కలు ప్రకటించాల్సి ఉంది.

America : వీసా అంశంలో అమెరికా కీలక నిర్ణయం.. వ్యక్తిగత ఇంటర్వ్యూలు రద్దు

ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు దాదాపు 350 ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి. వేరియంట్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంట్లో భాగంగా అమెరికా సహా జర్మనీ, ఇటలీ, టర్కీ, కెనడా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించింది. ఒమిక్రాన్‌ వ్యాప్తి..ఇజ్రాయెల్ లో ఒక మరణం నమోదు కావటంతో మరో బూస్టర్‌ డోసు పంపిణీ కోసం ఇజ్రాయెల్‌ ప్రభుత్వం యత్నిస్తోంది.