Omicron Death : జర్మనీలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు

జర్మనీలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు అయింది. జర్మనీలో ఇప్పటివరకు 3,198 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే బ్రిటన్, అమెరికా, ఇజ్రాయెల్ లో ఒమిక్రాన్ మరణాలు సంభవించాయి.

Omicron Death : జర్మనీలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు

Germany

first Omicron death in Germany : ప్రపంచదేశాలను కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. కొత్త వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. రోజు రోజుకూ ఒమిక్రాన్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. జర్మనీలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు అయింది. ఇప్పటికే బ్రిటన్, అమెరికా, ఇజ్రాయెల్ లో ఒమిక్రాన్ మరణాలు సంభవించాయి. జర్మనీలో ఇప్పటివరకు 3,198 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య లక్ష దాటిపోయింది. డిసెంబర్ 23న బ్రిటన్‌లో ఒక్కరోజే 15వేల 363 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. బ్రిటన్‌లో ఇప్పటివరకు 40 వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు బ్రిటన్ లో ఇప్పటివరకు నమోదయ్యాయి. అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది.

America : వీసా అంశంలో అమెరికా కీలక నిర్ణయం.. వ్యక్తిగత ఇంటర్వ్యూలు రద్దు

ఇప్పటికే వైరస్ ప్రబలంగా ఉన్న కొవిడ్ డెల్టా వైరస్‌పై ఒమిక్రాన్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. డెల్టా కొవిడ్ కేసుల కంటే ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం.. యుఎస్‌లో సీక్వెన్స్ అయిన కోవిడ్-19 కేసులలో ఒమిక్రాన్ వేరియంట్ 73శాతం వాటాను కలిగి ఉంది. గత వారం నుంచి 3శాతంగా కేసులు పెరిగాయి.

అమెరికాలో కేసుల సంఖ్య 15వందలని అధికారికంగా ప్రకటించినా కొత్త కేసుల్లో 70శాతానికి పైగా ఒమిక్రానే అంటున్నారు. అక్కడ రోజుకు లక్షకు పైగా కేసులు వస్తున్నాయి. ఆ లెక్కన ఒమిక్రాన్ కేసులు వేలల్లో ఉండాలి. అయితే అధికారికంగా ఆ లెక్కలు ప్రకటించాల్సి ఉంది.

Whale Shark Fish : విశాఖ తీరానికి అనుకోని అతిథి.. ప్రపంచంలోనే అతి పెద్ద చేప వేల్‌ షార్క్‌

ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు దాదాపు 350 ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి. వేరియంట్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంట్లో భాగంగా అమెరికా సహా జర్మనీ, ఇటలీ, టర్కీ, కెనడా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించింది. ఒమిక్రాన్‌ వ్యాప్తి..ఇజ్రాయెల్ లో ఒక మరణం నమోదు కావటంతో మరో బూస్టర్‌ డోసు పంపిణీ కోసం ఇజ్రాయెల్‌ ప్రభుత్వం యత్నిస్తోంది.

ఒమిక్రాన్ తో చనిపోయిన వ్యక్తి 60 ఏళ్లు కావటంతో..ప్రభుత్వం వద్ధుల ప్రాణాల్ని రక్షించటానికి మరో డోసు అందించడానిక యత్నిస్తోంది. 60ఏళ్లు పైబడినబారికి నాలుగో డోసు ఇవ్వాలని ఇజ్రాయెల్ నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. భారత్ లోనూ ఒమిక్రాన్‌ కేసులు రాకెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతున్నాయి.

Letter To KRMB : కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ మరో లేఖ

ప్రతీరోజు భారీ సంఖ్యలో ఒమిక్రాన్‌ కేసులు బయటపడుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 250 దాటింది. ఇక డెన్మార్క్‌లో 26వేల 362 కరోనా కేసులున్నాయి. నార్వేలో 3వేల 9వందలు, కెనడాలో 2వేల 3వందలు, అమెరికాలో 15వందలు, దక్షిణాఫ్రికాలో 14వందలకు పైగా కేసులున్నాయి.