Covid Vaccine : 24 గంటల్లో 10 సార్లు కొవిడ్‌ వ్యాక్సిన్లు వేయించుకున్న వ్యక్తి..నిర్దారించిన ఆరోగ్యశాఖ

ఓ వ్యక్తి 24 గంటల్లో 10 సార్లు కొవిడ్‌ వ్యాక్సిన్లు వేయించుకున్నాడు.దీంతో రంగంలోకి దిగింది ఆరోగ్యశాఖ. దర్యాప్తు చేపట్టగా నిజమేనని నిర్ధారణ జరిగింది.

Covid Vaccine : 24 గంటల్లో 10 సార్లు కొవిడ్‌ వ్యాక్సిన్లు వేయించుకున్న వ్యక్తి..నిర్దారించిన ఆరోగ్యశాఖ

Covid 19  Vaccine

Covid-19  Vaccine : కోవిడ్-19 వ్యాక్సిన్ వచ్చి దాదాపు సంవత్సరం అవుతోంది. ఈనాటికి చాలామంది వ్యాక్సిన్ వేయించుకోటానికి పెద్దగా ఆసక్తి చూపించటం లేదు. భయం వల్ల కొంతమంది. లేనిపోని అపోహల వల్ల మరికొంతమంది ఇలా పలు కారణాలతో వ్యాక్సిన్ వేయించుకోవటానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కానీ న్యూజిలాండ్ లో ఓ వ్యక్తి మాత్రం ఒకసారి రెండు సార్లు కాదు ఏకంగా 10 వ్యాక్సిన్లు వేయించుకున్నాడు..! అదికూడా 24 గంటల వ్యవధిలో..!! అదేంటీ..అలా ఎలా వేయిచుకున్నాడు?! మెడికల్ సిబ్బంది ఎలా వేశారు? అనే డౌట్ రానే వస్తుంది. ఇలా ఓ వ్యక్తి 10 టీకాలు వేయించుకున్నాడనే విషయం కాస్తా ఆరోగ్యశాఖ దృష్టికి వెళ్లటంతో అది నిజమేనా? కాదా? అని నిర్ధారించటానికి రంగంలోకి దిగారు అధికారులు. దీనిపై అన్ని విధాల దర్యాప్తు చేసి నిజమేనని నిర్ధారించారు.

Read more : Omicron Detection : పంటినొప్పి చికిత్స కోసం వెళ్లిన 12ఏళ్ల బాలికకు ఒమిక్రాన్!

న్యూజిలాండ్‌కు చెందిన ఒక వ్యక్తి కేవలం 24 గంటల్లో 10 సార్లు టీకా తీసుకున్నాడు. ఇది నిజమా? అబద్ధమా? అని తేల్చేందుకు న్యూజిలాండ్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి దర్యాప్తు చేయగా ఇది నిజమేనని నిర్ధారించింది. విచారణలో ఆ సదరు వ్యక్తి వేర్వేరు గుర్తింపు కార్డులతో వ్యాక్సిన్లు తీసుకున్నాడని సాక్షాత్తు ఆరోగ్యశాఖ అధికారులే నిర్ధారించారు.

న్యూజిలాండ్‌లో కరోనా నియంత్రణ కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. గత అక్టోబర్‌ నుంచి జీరో కొవిడ్‌ స్ట్రేటజీ అమలుచేస్తున్న క్రమంలో టీకా తీసుకునే వ్యక్తుల గుర్తింపు కార్డులపై పెద్దగా దృష్టి పెట్టలేదనే చెప్పాలి. దీన్ని అలుసుగా చేసుకున్న ఓ వ్యక్తి అత్యుత్సాహంతో ఏకంగా 10టీకాలు వేయించుకున్నారు. సదరు వ్యక్తి వేర్వేరు గుర్తింపు కార్డులతో ఒక్కరోజులోనే (24 గంటల్లో) ఏకంగా 10 సార్లు కొవిడ్‌ టీకా తీసుకున్నాడు. ఈవిషయం ఆరోగ్యమంత్రిత్వ శాఖ దృష్టికి వెళ్లటంతో సదరు శాఖా అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేయగా నిజమేనని తేలింది.

కానీ ఇలా వ్యాక్సిన్లు నిర్వరామంగా తీసుకోవడం వల్ల ప్రాణానికి ఎలాంటి అపాయం ఉండదని..కానీ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణుల.దీంతో సదరు వ్యక్తికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలని భావించారు. దీంట్లో బఆగంగా సదరు వ్యక్తి వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. అతడిని ఎట్టకేలకు గుర్తించారు. కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇలా తప్పుడు గుర్తింపు కార్డులతో టీకాలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని హెచ్చరించారు.

Read more : Mizoram : క్రైస్తవుల సంఖ్య పెరగాలి..పిల్లల్ని కనటానికి ప్రభుత్వం మహిళలకు మెటర్నిటి సెలవులు ఇవ్వాలి

ఆరోగ్య నిపుణులు సూచించిన ప్రకారమే టీకాలు వేయించుకోవాలని..వారి సూచనల మేరకే మెడిసిన్స్ తీసుకోవాలని వారు కోరారు. కాగా కరోనాను సమర్ధవంతంగా కట్టడి చేసిన దేశంగా న్యూజిలాండ్ పేరొందింది. ప్రధాని జెసిండా అర్డెర్న్ ముందు చూపుతోను..పక్కా ప్రణాళికలతోను కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంది. ఒక్క కేసు బయటపడిని కఠినచర్యలు తీసుకుంటు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి కరోనాను కట్టిడి చేస్తోంది. ప్రపంచ దేశాల్లో కరోనాను సమర్థంగా కట్టడి చేసిన దేశాల్లో న్యూజిలాండ్ పేరొందింది.