Dry Fruit Jewellery : హలో లేడీస్.. డ్రై ఫ్రూట్ నగల్ని చూసారా? భలే ఉన్నాయి..

సోషల్ మీడియాలో రోజు అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. రీసెంట్‌గా ఓ మహిళ ధరించిన 'డ్రై ఫ్రూట్స్ జ్యయలరీ' వైరల్ అవుతోంది. ఈ నగలు చూడటానికి బాగున్నా నెటిజన్లు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే?

Dry Fruit Jewellery : పెళ్లి వేడుకల్లో .. ప్రత్యేక సందర్భాల్లో చాలామంది మహిళలు మేకప్‌తో అందానికి మెరుగులు దిద్దుకోవడమేకాదు.. రకరకాల ఆభరణాలు ధరించడానికి ఆసక్తి కనబరుస్తారు. కొందరు సంప్రదాయమైన దుస్తులు, ఆభరణాలు ఎంపిక చేసుకుంటే కొందరు ట్రెండ్‌ని ఫాలో అవుతుంటారు. రీసెంట్‌గా బేబీ షవర్ కోసం ఓ లేడీ ధరించిన డ్రై ఫ్రూట్స్ జ్యయలరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Suhani Bhatnagar : 19 ఏళ్లకే మరణించిన సుహానీ భట్నాగర్ ఎవరు? దంగల్ తర్వాత సినిమాలకు ఎందుకు దూరమైంది?

వైరల్ అవుతున్న వీడియోలో మహిళ హారాలు, కంకణాలు, చెవిపోగులు, హెయిర్ బ్యాండ్, వడ్డాణం ఇవన్నీ కూడా బాదం, జీడిపప్పు, పిస్తా, పచ్చి ఏలకులు మొదలైన వాటితో తయారు చేసి అలంకరించారు. 11 మిలియన్ల వ్యూస్ దాటి దూసుకుపోతున్న ఈ వీడియోపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు.

Varun Tej : ఆరు నెలల ముందే చిరంజీవి గారి దగ్గర నుంచి మెసేజ్.. అంతా ఆయనే ప్లాన్ చేస్తారు.. మా డేట్స్ అన్ని..

డ్రై ఫ్రూట్స్ జ్యుయలరీ వీడియో చూసిన నెటిజన్లు ‘ఆహారం వృధా చేస్తున్నారు..దయ చేసి ఇలాంటివి ఆపండి’ అంటూ మండిపడ్డారు. మరికొంతమంది ‘కొత్త ట్రెండ్ అని.. చాలా రిచ్ అయి ఉంటారని’ కామెంట్ చేసారు. డ్రై ఫ్రూట్స్ జ్యుయలరీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు