Varun Tej : ఆరు నెలల ముందే చిరంజీవి గారి దగ్గర నుంచి మెసేజ్.. అంతా ఆయనే ప్లాన్ చేస్తారు.. మా డేట్స్ అన్ని..

మెగాస్టార్ చిరంజీవి గురించి వరుణ్ తేజ్ ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులకు తెలియజేశారు.

Varun Tej : ఆరు నెలల ముందే చిరంజీవి గారి దగ్గర నుంచి మెసేజ్.. అంతా ఆయనే ప్లాన్ చేస్తారు.. మా డేట్స్ అన్ని..

Varun Tej interesting comments about Chiranjeevi in tv show

Updated On : February 17, 2024 / 4:00 PM IST

Varun Tej : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి సంబరం అంతా పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఎవరికి వారు తమ తమ కెరీర్ ప్రాజెక్ట్స్ లో బిజీ అయ్యారు. వరుణ్ తేజ్ తన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రమోషన్స్‌తో, లావణ్య ‘మిస్ పర్ఫెక్ట్’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇక ఈ ప్రమోషన్స్ నేపథ్యంలోనే ఇద్దరు ‘సూపర్ సింగర్’ షోకి గెస్టులుగా వచ్చారు. ఇక ఈ షోలో పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ఈక్రమంలోనే మెగా ఫ్యామిలీ ఫెస్టివల్ సెలబ్రేషన్ మీటింగ్స్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వరుణ్ అభిమానులకు తెలియజేశారు. మెగా ఫ్యామిలీ హీరోలంతా.. పండుగ సమయాల్లో చిరంజీవి, అల్లు అరవింద్ ఇంట ఒకటిగా కలుసుకొని ఫెస్టివల్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే సంగతి అందరికి తెలిసిందే. ఇక ఆ సెలబ్రేషన్స్ తరువాత మెగా హీరోలంతా కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

Also read : Ram Charan : ‘ఆరెంజ్’ పాటలకి ఇంతటి క్రేజ్ ఉందా..? ఈ వైరల్ వీడియో చూశారా..!

అందుకే ఏదైనా పండుగ వస్తే, మెగా అభిమానులంతా.. ఆ గ్రూప్ ఫోటో కోసం ఎదురు చూస్తుంటారు. ఇటీవల సంక్రాంతి పండుగని కూడా బెంగళూరులోని చిరంజీవి ఫార్మ్ హౌస్ లో మెగా ఫ్యామిలీ అంతా కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా ఈ ఈవెంట్స్ అన్నిటిని చిరంజీవే ప్లాన్ చేస్తారట. పండగకి ఆరు నెలలు ముందే చిరంజీవి నుంచి మెగా హీరోలు అందరికి ఓ మెసేజ్ వెళ్తుందట.

వర్క్ లో బిజీ అవ్వడంతో తరుచు కలవడం అనేది జరగని పని. అందుకనే పండగలకి అయినా ఒకసారి అందరూ కలుసుకోవాలని చిరంజీవి ప్లాన్ చేస్తారట. పండగకి ఆరు నెలలు ముందే.. అందరికి ఒక టెక్స్ట్ మెసేజ్ వెళ్తుందట. పలానా డేట్స్ ఖాళీగా పెట్టుకోండి. అప్పుడు కలుదాం అని చిరు చెబుతారట.