అందరూ తెలుసుకోవాలి : ట్రాఫిక్ చలాన్లు కట్టకపోతే ఏమవుతుంది!

ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో జారీ అయిన ఈ చలాన్లను పట్టించుకోవడం లేదా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే. అవును నిజం. పరిస్థితులు మారిపోతున్నాయి. చలాన్‌లు వెంటనే కట్టేయండి. లేకుంటే ప్రమాదంలో పడాల్సి వస్తుంది. వీటి నుంచి తప్పించుకోవచ్చని అనుకుంటున్న వాహనదారులు అది కష్టమని తెలుసుకోవాల్సి ఉంటుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
హై టెక్నాలజీ సహాయంతో ఈ చలాన్లను ట్రాఫిక్ పోలీసులు విధిస్తున్నారు. దీనిద్వారా ఈ చలాన్‌లు నేరుగా ఇంటికే వద్దకు పంపిస్తున్నారు. ఏటీఎం, పేటీఎం, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉన్నా..చేయడం లేదు. ట్రాఫిక్ పోలీసులు పంపిన వీటిని ఈజీగా తీసుకోవద్దంటున్నారు.
ఏమవుతుంది : –
ఓ కానిస్టేబుల్ నేరుగా రిజిష్టర్ అయిన ఇంటి దగ్గరకు చేరుకుంటాడు.
ఈ చలాన్ పెండింగ్‌లో ఉందో లేదో చూస్తారు. ఆ వ్యక్తికి నేరుగా కోర్టు సమన్లు జారీ చేస్తారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు జడ్జీ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కోర్టుకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఈ చలాన్ కట్టకపోతే అతని లైసెన్స్ రద్దు అవుతుంది.
రోడ్డు ప్రమాదాలు అధిక అవుతుండడంతో నిబంధనలు కఠినతరం చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఆయా చోట్ల ఉండే ట్రాఫిక్ పోలీసులు కెమెరా ద్వారా ఫొటో తీస్తున్నారు. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఉండే..కెమెరాలను పరిశీలిస్తున్నారు. రెడ్ సిగ్నల్ క్రాస్ చేయడం, హెల్మెట్ లేకపోవడం, రాంగ్ రూట్‌లో ప్రయాణం..తదితర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు విధిస్తున్నారు. వాహనదారుడికి సెల్ ఫోన్ ద్వారా మేసెజ్ పంపియ్యడం..ఇంటికి పోస్టు ద్వారా ఫైన్ వివరాలను పంపిస్తున్నారు. కొంతమంది మాత్రం చలాన్లు కడుతుంటే..మరికొందరు లైట్ తీసుకుని అదే బండి తీసుకుని రయ్యి మంటూ రోడ్డు మీదకు దూసుకొస్తున్నారు. వీరికి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు రెడీగా ఉంటున్నారు.
తమ వాహనానికి ఏమైనా పెండింగ్ చలాన్లు ఉన్నాయనేది ఆయా ట్రాఫిక్ పోలీసుల వెబ్ సైట్ చూసి తెలుసుకోవచ్చు.
తొలుతగా సిటీ ట్రాన్స్ పోర్టు వెబ్ సైట్‌లోకి వెళ్లాలి.
ఆప్షన్ల వద్ద వాహన రిజిష్టర్ నెంబర్, దానిపక్కనే పైన ఉన్న కోడ్ ఎంటర్ చేయాలి. గో ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
వాహనంపై ఉన్న ట్రాఫిక్ ఉల్లంఘనలు కనిపిస్తాయి.
ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా నిబంధనలు ఉల్లంఘించారో స్పష్టం తెలియచేస్తుంది.
మీ చలాన్ వివరాలను ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
చలాన్‌ను నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ సేవ ద్వారా చెల్లించే ఛాన్స్ ఉంది.