మెట్రో మ్యాన్ కి “జనతా గ్యారేజ్” ఫుల్ సపోర్ట్

కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ లెజండరీ యాక్టర్ మోహన్‌లాల్ బీజేపీ సీఎం అభ్యర్థి "మెట్రో మ్యాన్" ఈ శ్రీధరన్‌ కు మద్దతు ప్రకటించారు.

E Sreedharan కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ లెజండరీ యాక్టర్ మోహన్‌లాల్ బీజేపీ సీఎం అభ్యర్థి “మెట్రో మ్యాన్” ఈ శ్రీధరన్‌ కు మద్దతు ప్రకటించారు. దేశాన్ని ముందుకు నడిపించేందుకు శ్రీధరన్ సేవలు చాలా అవసరమని అన్నారు. ఈ మేరకు మోహన్ లాల్ ఓ వీడియో మేసేజ్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

వరదలకు ధ్వంసమైన పాంబన్ బ్రిడ్జిని కేవలం 46 రోజుల్లో పునర్నిర్మించిన ధీశాలి శ్రీధరన్ అని మోహన్ లాల్ కొనియాడారు. అది ఆయన మనోధైర్యానికి ప్రతీక అని అభివర్ణించారు. నిర్ణీత సమయం లోపు ప్రాజెక్టులను పూర్తి చేసిన తరువాత బ్యాలెన్స్ ఫండ్లను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చే స్వచ్ఛమైన వ్యక్తి శ్రీధరన్ అని ప్రశంసించారు. ఢిల్లీ, కొచ్చి మెట్రో రైలు నిర్మాణంలో ఆయన సేవలు మరువలేనివని మోహన్‌లాల్ కొనియాడారు.

also read:కేరళలో కింగ్ మేకర్ బీజేపీనే -మెట్రో మ్యాన్ 

దాదాపు అందరూ అసాధ్యమని భావించిన కొంకన్ రైల్వేస్ కలని శ్రీధరన్ సాకారం చేశారని ప్రశంసించారు. టన్నెల్స్ నిర్మించడం ద్వారా ఆయన కొంకన్ రైల్వేస్ కలని సాకారం చేశారని ప్రశంపించారు. శ్రీధరన్‌కు అంతా మంచే జరగాలంటూ శుభాకాంక్షలు తెలిపారు మోహన్‌లాల్. మోహన్‌లాల్ వీడియోను ట్విట్టర్ పోస్ట్ చేసిన మెట్రో మ్యాన్ శ్రీధరన్.. ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. అందరం కలసి కొత్త కేరళను నిర్మిద్దామని శ్రీధరన్ ట్వీట్ చేశారు.

ఈ నెల 6న కేరళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పాలక్కాడ్ నియోజకవర్గం నుంచి శ్రీధరన్ పోటీ చేస్తున్నారు. బీజేపీ..తమ సీఎం అభ్యర్థిగా ఇప్పటికే 97ఏళ్ల శ్రీధరన్ పేరుని ప్రకటించింది. పాలక్కాడ్ నియోజకవర్గం నుంచి శ్రీధన్ అసెంబ్లీ బరిలో నిలిచారు.

శ్రీధరన్ కు మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుంది. వృత్తిరిత్యా సివిల్ ఇంజినీరైన శ్రీధరన్.. మన దేశంలో ప్రజా రవాణా ముఖచిత్రాన్నే సమూలంగా మార్చేశారు. ఈయన సారథ్యంలో కొంకణ్ రైల్వేతో పాటు ఢిల్లీ మెట్రో నిర్మాణం జరిగింది. శ్రీధరన్ గైడెన్స్‌లోనే లక్నో మెట్రో రికార్డు టైమ్‌లో పూర్తయింది. అంతేకాదు కేరళలోని కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ ప్రాజెక్టుకు ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. కాగా, 2017లో లక్నో మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీధరన్‌ను పట్టించుకోలేదని అప్పట్లో బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన సలహాలు సూచనలతోనే లక్నో మెట్రో ప్రాజెక్టు వేగవంతంగా పూర్తయింది. అయితే ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేదికపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు ఉన్నారు. అయితే ఆ మెట్రో ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన శ్రీధరన్ మాత్రం పక్కనబెట్టారేశారని విమర్శలు వచ్చాయి. ప్రారంభోత్సవంలో శ్రీధరన్ ఓ మూలన నిల్చున్న ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

Es

ట్రెండింగ్ వార్తలు