Earthquake : లేహ్, లడాఖ్ ప్రాంతాల్లో భూకంపం

జమ్మూకశ్మీరులో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. లేహ్, లడాఖ్ ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున 4.33 గంటలకు భూకంపం సంభవించింది....

Earthquake hits Leh, Ladakh

Earthquake : జమ్మూకశ్మీరులో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. లేహ్, లడాఖ్ ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున 4.33 గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది.

ALSO READ : Romanian flight : ఫ్రాన్స్ విమానం ముంబయిలో ల్యాండింగ్

అయిదు కిలోమీటర్ల లోతులు సంభవించిన భూకంపంతో లేహ్, లడాఖ్ ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఇళ్లలో నిద్రపోతున్న జనం లేచి బయట రోడ్లపైకి పరుగులు తీశారు. కొత్త సంవత్సర వేడుకల కోసం పర్యాటకులు పెద్ద సంఖ్యలో లేహ్, లడాఖ్ ప్రాంతాలకు తరలివచ్చారు. లేహ్, లడాఖ్ ప్రాంతాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి.

ALSO READ : Today Headlines: నేడు ప్రధాని మోదీతో రేవంత్, భట్టి విక్రమార్క భేటీ.. 28న హైదరాబాద్ కు అమిత్ షా

జమ్మూకశ్మీరులోని కిష్టావర్ ప్రాంతంలోనూ మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. కిష్టావర్ ప్రాంతంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. మంగళవారం తెల్లవారుజామున 1.10 గంటలకు సంభవించిన భూకంపం 5 కిలోమీటర్ల లోతులో సంభవించిందని శాస్త్రవేత్తలు చెప్పారు. కిష్టావర్, లేహ్, లడాఖ్ ప్రాంతాల్లో ఒకేరోజు భూకంపాలు సంభవించాయి.