Romanian flight : ఫ్రాన్స్ విమానం ముంబయిలో ల్యాండింగ్
మానవ అక్రమ రవాణ అనుమానంతో నాలుగురోజుల పాటు ఫ్రాన్స్ దేశంలో నిర్బంధానికి గురైన రోమేనియన్ విమానం మంగళవారం తెల్లవారుజామున ఎట్టకేలకు ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయింది....

Romanian flight
Romanian flight : మానవ అక్రమ రవాణ అనుమానంతో నాలుగురోజుల పాటు ఫ్రాన్స్ దేశంలో నిర్బంధానికి గురైన రోమేనియన్ విమానం మంగళవారం తెల్లవారుజామున ఎట్టకేలకు ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ నుంచి 303 మంది ప్రయాణీకులతో బయలుదేరిన నికరాగ్వా వెళ్లే చార్టర్ ఫ్లైట్ అనుమానిత మానవ అక్రమ రవాణా అనుమానంతో పారిస్‌కు తూర్పున 150 కిలోమీటర్ల దూరంలోని వాట్రీ విమానాశ్రయంలో గురువారం నిలిపివేసింది.
ALSO READ : Bigg Boss : పల్లవి ప్రశాంత్ కేసు.. బిగ్‌బాస్ నిర్వాహకులకు పోలీసుల నోటీసులు
ఫ్రాన్స్‌లో నిర్బంధానికి గురైన విమానంలో ఎక్కువ మంది భారతీయులున్నారు. ఫ్రెంచ్ అధికారులు విమానాన్ని తిరిగి వెళ్లేందుకు అనుమతించడంతో తిరిగి ముంబయికు వచ్చింది. ఈ విమాన ప్రయాణికుల్లో 21 నెలల చిన్నారి, 11 మంది తోడు లేని మైనర్లు ఉన్నారు. రోమేనియన్ కంపెనీ లెజెండ్ ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తున్న ఈ విమానం మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ముంబయికి చేరుకుంది.
కొంతమంది ప్రయాణికులు భారతదేశానికి తిరిగి రావడానికి ఇష్టపడకపోవడంతో విమానం బయలుదేరడం ఆలస్యం అయింది. ఇద్దరు మైనర్లతో సహా 25 మంది ప్రయాణికులు ఫ్రాన్స్‌లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం సమస్యను పరిష్కరించి, విమానాన్ని తిరిగి వెళ్లడానికి అనుమతించినందుకు ఫ్రెంచ్ అధికారులకు ధన్యవాదాలు తెలిపింది.
ALSO READ : Rigorous Imprisonment: భార్యతో ఇలాంటి సిగ్గుమాలిన చర్యకు పాల్పడిన భర్తకు 9 ఏళ్ల జైలు శిక్ష
భారతీయ ప్రయాణీకులు సెంట్రల్ అమెరికాకు చేరుకోవడానికి ఈ యాత్రను ప్లాన్ చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. అక్రమ ఇమ్మిగ్రేషన్ రింగ్‌లో పాత్ర పోషించారనే అనుమానంతో ఇద్దరు వ్యక్తులను శుక్రవారం ఫ్రెంచ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా విమానయాన సంస్థ అక్రమ రవాణాలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని ఖండించింది.
Aircraft with 303 Indian passengers held in France lands at Mumbai airport
Read @ANI Story | https://t.co/EntWmNUi3t#France #MumbaiAirport pic.twitter.com/SY5lfsZOJ6
— ANI Digital (@ani_digital) December 26, 2023