Rigorous Imprisonment: భార్యతో ఇలాంటి సిగ్గుమాలిన చర్యకు పాల్పడిన భర్తకు 9 ఏళ్ల జైలు శిక్ష

Rigorous Imprisonment: అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఆమెతో బలవంతంగా...

Rigorous Imprisonment: భార్యతో ఇలాంటి సిగ్గుమాలిన చర్యకు పాల్పడిన భర్తకు 9 ఏళ్ల జైలు శిక్ష

Representative Image

Updated On : December 25, 2023 / 9:30 PM IST

భార్యను తొమ్మిదేళ్లుగా హింసించాడు ఓ భర్త. ఆమెతో బలవంతంగా అసహజ శృంగారం చేశాడు. చివరకు ఆమె కేసు వేయడంతో సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు.. ఆమె భర్తకు తొమ్మిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు 2007లో ఓ మహిళతో పెళ్లి జరిగింది.

అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఆమెతో బలవంతంగా అసహజ శృంగారం చేసేవాడు. అంతేగాక కట్నం కోసం వేధింపులకు గురి చేసేవాడు. భర్త టార్చర్ తట్టుకోలేక ఆమె 2016లో ఆమె తన కూతురిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. సుపేలా పోలీస్ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి కూతురిని పెంచుకుంటూ పుట్టింట్లోనే ఉంటుంది. దుర్గ్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఆమె కేసులో ఏడేళ్ల పాటు విచారణ జరిగింది.

ఐపీసీ సెక్షన్ 377 కింద అసహజ శృంగారంతో పాటు 498ఏ కింద తన భర్త, అతడి తల్లిదండ్రులపై వరకట్న వేధింపుల కేసులపై విచారణ జరిగింది. అతడు పాల్పడ్డ నేరాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు భార్యతో బలవంతంగా అసహజ శృంగారానికి పాల్పడడం ఐపీసీ సెక్షన్ 377 కింద నేరమని చెప్పింది. అతడికి జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే, బాధితురాలిని వేధింపులకు గురిచేసిన అతడి కుటుంబ సభ్యులకూ ఆరు నెలల జైలు శిక్ష పడింది.

Woman Techie Dies: ఘోరాతి ఘోరం.. సాఫ్ట్‌వేర్ అమ్మాయిని సజీవ దహనం చేసిన మాజీ క్లాస్‌మెట్