మహారాష్ట్రలో పలుమార్లు భూ ప్రకంపనలు

మహారాష్ట్రలో భూ ప్రకంపనలు సంభవించాయి. పల్ఘర్ జిల్లాలో మూడు సార్లు భూమి కంపించింది.

  • Publish Date - December 14, 2019 / 06:58 AM IST

మహారాష్ట్రలో భూ ప్రకంపనలు సంభవించాయి. పల్ఘర్ జిల్లాలో మూడు సార్లు భూమి కంపించింది.

మహారాష్ట్రలో భూ ప్రకంపనలు సంభవించాయి. పల్ఘర్ జిల్లా దహను తాలుకాలోని దుండల్‌వాడిలో శుక్రవారం(డిసెంబర్ 13, 2019) మధ్యాహ్నం నుంచి శనివారం(డిసెంబర్ 14, 2019) తెల్లవారుజాము వరకు మూడు సార్లు భూమి కంపించింది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. దుండల్‌వాడిలో భూమి కంపించిన మాట వాస్తవమేనని జిల్లా కలెక్టర్ డాక్టర్ కైలాష్ షిండే స్పష్టం చేశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తెలిపారు. 

శనివారం తెల్లవారుజామున 5.22 గంటలకు భూమి కంపించగా, రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 3.9గా నమోదైంది. శుక్రవారం మధ్యాహ్నం 12.26 గంటలకు తొలిసారిగా భూ ప్రకంపనలు సంభవించాయి. ఆ సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదు అయింది. శుక్రవారం రాత్రి 9.55 గంటలకు రెండోసారి భూమి కంపించింది. ఆ సమయంలో భూకంప తీవ్రత 3.4గా నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. 
 

ట్రెండింగ్ వార్తలు