Earthquake North East States : భారత్-మయన్మార్ సరిహద్దుల్లో భారీ భూకంపం

ఈశాన్య భారతంలో శుక్రవారం తెల్లవారు ఝామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.1 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

Earthquake North East States :  ఈశాన్య భారతంలో శుక్రవారం తెల్లవారు ఝామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.1 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. బంగ్లాదేశ్ లోని చిట్టగ్యాంగ్ కు 143 కిలోమీటర్ల దూరంలోనూ…. మరోవైపు ఈశాన్య భారతంలోని ఐజ్వాల్ కు 126 కిలో మీటర్లు దూరంలో భూకంప కేంద్రం ఏర్పడినట్లు భారత సీస్మోలజి సెంటర్ శాస్త్రవేత్తలు తెలిపారు.

భూకంప కేంద్రం మిజోరంలోని థెన్‌జాల్‌కు ఆగ్నేయంగా 12కిలోమీటర్ల దూరంలో 73కిలోమీటర్ల లోతులో ఉందని దేశంలో భూకంప కార్యకలాపాలను పర్యవేక్షించే కేంద్ర నోడల్ ఏజెన్సీ విశ్లేషించింది.
Also Read : Earthquake In Chittoor : చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు
ప్రకంపనలు ఈశాన్య భారతంలోని తిపుర, మిజోరాం, మణిపూర్, అసోం రాష్ట్రాలను తాకింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా, గౌహతి వరకు భూకంపం తీవ్రత నమోదైనట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్(ఈఎంఎస్‌సీ) తెలిపింది.

దాదాపు 30 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. శుక్రవారం ఉదయం గం.05-15 లకు, తిరిగి గం.05-33 లకు తిరిగి రెండో సారి భూకంపం సంభవించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. రెండో సారి సంభవించిన భూకంప తీవ్రత 5.8గా ఈఎంఎస్‌సీ తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు