Earthquake In Chittoor : చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు

చిత్తూరు జిల్లా లో మరోసారి  భూప్రకంపనలు ప్రజలను వణికిస్తున్నాయి. రెండురోజుల క్రితం సోమల మండలం లో భూమి కంపించగా తాజాగా రామకుప్పం లో భూమి కంపించింది.

Earthquake In Chittoor : చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు

Chittoor Earthquake

Updated On : November 26, 2021 / 11:04 AM IST

Earthquake In Chittoor :  చిత్తూరు జిల్లా లో మరోసారి  భూప్రకంపనలు ప్రజలను వణికిస్తున్నాయి. రెండురోజుల క్రితం సోమల మండలం లో భూమి కంపించగా తాజాగా రామకుప్పం లో భూమి కంపించింది. నిన్న సాయంత్రం నుండి రెండు సార్లు భూప్రకంపనలు వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.

ప్రకంపనలకు భయపడిన ప్రజలు ఇళ్ళలోంచి బయటకు పరుగులు తీశారు. పలు చోట్ల ఇళ్ళ గోడలు బీటలు వారినట్లు తెలిపారు. భూప్రకంపలు  వచ్చినప్పుడు ఇళ్లలోని వస్తువులు కిందపడ్డాయి. దీంతో ప్రజలంతా రాత్రి ఇంటిబయటే జాగారం చేశారు.
Also Read : Friendly Police : మీ స్మార్ట్ ఫోన్ పోయిందా …మాకు ఫిర్యాదు చేయండి తెచ్చిస్తాం అంటున్న పోలీసులు
రామకుప్పం మండలంలోని గడ్డూరు, గెరిగెపల్లి, యానాది కాలనీ, కృష్ణనగర్, గొరివిమాకులపల్లి గ్రామాల్లో భూమి కంపించినట్లు తెలుస్తోంది. ఆయా గ్రామాల్లో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు.