Prakash Raj: రూ.100 కోట్ల పోంజీ స్కాం.. నటుడు ప్రకాష్ రాజ్ కు ఈడీ సమన్లు

పోలీసుల ఫిర్యాదులో ఇతరులు బంగారం పెట్టుబడి పథకం పేరుతో ప్రజల నుంచి రూ.100 కోట్లను అధిక రాబడి వస్తుందని ప్రణబ్ జ్యువెలర్స్‌ నమ్మించి మోసం చేసిందని ఫెడరల్ ఏజెన్సీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Prakash Raj: రూ.100 కోట్ల పోంజీ స్కాం.. నటుడు ప్రకాష్ రాజ్ కు ఈడీ సమన్లు

పోంజీ పథకం కేసులో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం సమన్లు ​​జారీ చేసింది. గతంలో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న ప్రణవ్ జ్యువెలర్స్‌పై ఈడీ దాడులు చేసింది. ఏజెన్సీ ప్రకారం, మనీలాండరింగ్ కేసులో ప్రకాష్ రాజ్‌ను ఈడీ ఇప్పుడు విచారించనుంది. ప్రణవ్ జ్యువెలర్స్ కోసం ప్రకాష్ రాజ్ ప్రకటనలు ఇచ్చారు.

ఈడీ ఎదుట ఎప్పుడు హాజరవుతారు?
ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం.. ఈ కంపెనీకి ప్రకాష్ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. వచ్చే వారం చెన్నైలోని ఈడీ ఎదుట హాజరుకావాలని ఆదేశాలు అందాయి. విభిన్న పాత్రలు పోషిస్తూ తెలుగు, తమిళ, కన్నడ సినీ ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితుడైన నటుడు ప్రకాష్ రాజ్.. భారతీయ జనతా పార్టీపై తరుచూ విమర్శలు చేయడం గమనించవచ్చు.

పోలీసుల ఫిర్యాదులో ఇతరులు బంగారం పెట్టుబడి పథకం పేరుతో ప్రజల నుంచి రూ.100 కోట్లను అధిక రాబడి వస్తుందని ప్రణబ్ జ్యువెలర్స్‌ నమ్మించి మోసం చేసిందని ఫెడరల్ ఏజెన్సీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. నిజానికి తమిళనాడు పోలీసు ఆర్థిక నేరాల విభాగానికి చెందిన ఎఫ్ఐఆరా ఆధారం చేసుకుని ఈడీ చర్యలకు దిగింది.

అయితే దీనిపై నటుడు ప్రకాష్ రాజ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ ఆయన కొద్ది సేపటి క్రితం చేసిన ట్వీట్ మాత్రం ఇందుకు అనుగుణంగానే కనిపిస్తోంది. అప్పట్లో బెంగాల్ ఎన్నికల సందర్భంగా ‘ఖేలా హోబే’ (ఆట మొదలెడదాం) అంటూ మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారం ప్రచారం చేశారు. దీదీకి అప్పుడు ప్రత్యర్థి బీజేపీనే. బహుశా అదే అర్థంలో ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ చేశారని నెటిజెన్లు అంటున్నారు.