Edible Oil Prices: భారీగా తగ్గిన వంటనూనెల ధరలు

దేశంలో వంటనూనె ధరలు భారీగా తగ్గాయి. దేశంలోని చాలా ప్రాంతాలల్లో పామాయిల్‌పై రూ.20, వేరుశెనగ నూనెపై రూ.18, సోయాబీన్‌పై రూ.10‌, పొద్దుతిరుగుడు నూనె

Oil

Edible Oil Prices దేశంలో వంటనూనె ధరలు భారీగా తగ్గాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో పామాయిల్‌పై రూ.20, వేరుశెనగ నూనెపై రూ.18, సోయాబీన్‌పై రూ.10‌, పొద్దుతిరుగుడు నూనె ధర రూ.7 తగ్గినట్లు శుక్రవారం కేంద్ర ఆహార మరియు ప్రజాసరఫరా మంత్రిత్వశాఖ సెక్రటరీ సుదాన్షు పాండే శుక్రవారం ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ తెలిపారు. కేంద్రప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే గడిచిన 3 రోజుల్లో వంటనూనె ధరలు రూ.5-10 వరకు తగ్గినట్లు పాండే చెప్పారు.

అదే సమయంలో, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పొడిగింపుపై వచ్చిన ఊహాగానాలను పాండే ఖండించారు. “ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ మోడ్‌లో ఉంది కాబట్టి, ప్రస్తుతానికి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను పొడిగించే ప్రతిపాదన లేదు” అని పాండే చెప్పారు.

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనేది… కోవిడ్-19 మహమ్మారి వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించడంలో పేదలకు సహాయం చేయడానికి(ఉచిత రేషన్ అందించడానికి) ఉద్దేశించిన రూ. 1.70 లక్షల కోట్ల రూపాయల విలువైన సమగ్ర సహాయ ప్యాకేజీ.

ALSO READ Farmers Protest : రైతులపై అనుచిత వ్యాఖ్యలు..బీజేపీ ఎంపీ కారు ధ్వంసం