TRS Convert BRS : అధికారికంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడానికి.. ఢిల్లీలో మొదలైన ప్రయత్నాలు

అధికారికంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడానికి ఢిల్లీలో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈసీని ప్రణాళికా సంఘం అధ్యక్షుడు వినోద్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి కలవనున్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ చేసిన తీర్మానాన్ని, పార్టీ రాజ్యాంగానికి చేసిన సవరణలను ఈసీకి నేతలు అందజేయనున్నారు.

TRS Convert BRS : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును ‘భారత్‌ రాష్ట్ర సమితి’ (బీఆర్‌ఎస్‌)గా మారుస్తూ సీఎం కేసీఆర్ ప్రకటించి, తీర్మానం చేసిన విషయం తెలిసిందే. జాతీయ పార్టీ గుర్తింపు కోసం ఎన్నికల కమిషన్ కు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే అధికారికంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడానికి ఢిల్లీలో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈసీని ప్రణాళికా సంఘం అధ్యక్షుడు వినోద్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి కలవనున్నారు.

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ చేసిన తీర్మానాన్ని, పార్టీ రాజ్యాంగానికి చేసిన సవరణలను ఈసీకి నేతలు అందజేయనున్నారు. రాజకీయ పార్టీ పేరును సవరించుకునేందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్‌ 29-ఏ అవకాశం కల్పిస్తుంది. పార్టీ పేరును సవరిస్తూ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసిన తీర్మానాన్ని 30 రోజుల్లోగా ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వాలని ఈసీ నిబంధన ఉంది.

TRS to BRS: టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్.. జాతీయ పార్టీగా మారుస్తూ తీర్మానం.. కేసీఆర్ సంతకం

కొత్తగా పెట్టిన పేరు ఇప్పటికే మనుగడలో ఉన్న వేరే పార్టీ పేరును పోలి ఉండకూడదని నిబంధన ఉంది. పార్టీ పేరును ఇంగ్లిష్‌, హిందీతోపాటు ఏ ప్రాంతీయ భాషలోకి అనువదించినా వేరే పార్టీ పేరు స్ఫురించకూడదని నిబంధన ఉంది. ఇప్పటికే ఉన్న ఇతర పార్టీ పాపులారిటీకి సమస్య అవుతుందనే ఫిర్యాదులు, అభ్యంతరాలు లేకపోతే పార్టీ పేరు మార్పుపై తిర్మానాలను ఈసీ పరిశీలించి నిర్ణయం తీసుకుని నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

పార్టీ పేరు, గుర్తు అంశాలపై ఇతర రాజకీయ పక్షాల నుంచి అభ్యంతరాలు తెలుసుకుని పార్టీ పేరు మార్పుపై ఈసీ నిర్ణయం తీసుకోనుంది. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వివరాలను ఈసీకి నేతలు అందించనున్నారు. సర్దార్ పటేల్ మార్గ్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల కోసం రాజస్థాన్ జోధ్ పూర్ రాజ వంశీయుల ఖేత్రి ట్రస్టు బంగ్లాను బీఆర్ఎస్ అద్దెకు తీసుకుంది.

National Party : జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.. ఏయే అర్హతలుండాలి!

మరోవైపు రేపు మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడంపై ఈసీ త్వరగా నిర్ణయం తీసుకుంటే మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పేరు పైనే అధికారపక్షం పోటీ చేసే అవకాశం ఉంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ట్రెండింగ్ వార్తలు