TRS to BRS: టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్.. జాతీయ పార్టీగా మారుస్తూ తీర్మానం.. కేసీఆర్ సంతకం

టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీ పేరు బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా మారింది. తమ పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. దానిపై ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. దాదాపు 21 ఏళ్ల క్రితం 2001, ఏప్రిల్ 27న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా, ఉద్యమ పార్టీగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఇవాళ కీలక మలుపు తిరిగింది. ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు.

TRS to BRS: టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్.. జాతీయ పార్టీగా మారుస్తూ తీర్మానం.. కేసీఆర్ సంతకం

CM KCR National Party

TRS to BRS: టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీ పేరు బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా మారింది. తమ పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. దానిపై ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. దాదాపు 21 ఏళ్ల క్రితం 2001, ఏప్రిల్ 27న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా, ఉద్యమ పార్టీగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఇవాళ కీలక మలుపు తిరిగింది.

ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. జాతీయ పార్టీగా టీఆర్ఎస్ ఆవిష్కృతమైన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కాగా, టీఆర్ఎస్ పేరుతో పాటు ఆ పార్టీ రాజ్యాంగంలోని మౌలిక అంశాలకు సర్వసభ్య సమావేశంలో సవవిస్తూ ఇవాళ తీర్మానం చేశారు.

ఈ సమావేశంలో ప్రత్యేక అతిథులుగా కర్ణాటక నుంచి జేడీఎస్ నేతలు, తమిళనాడుకు నుంచి వీసీకే నేతలు వచ్చి పాల్గొన్నారు. ముందుగా ప్రకటించిన విధంగానే ఇవాళ మధ్యాహ్నం 1.19 నిమిషాలకు కేసీఆర్ తీర్మానంపై సంతకం చేసి తమ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించారు. టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ కార్యాలయాల వద్ద సంబరాలు చేసుకుంటున్నారు.

ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా టీఆర్ఎస్ మారడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండుతోంది. అన్ని టీఆర్ఎస్ కార్యాలయాల పరిసర ప్రాంతాల్లో గులాబీ పోస్టర్లు, కేసీఆర్, కేటీఆర్ కటౌట్లు కనపడుతున్నాయి. తెలంగాణ సీఎంగా కేటీఆర్ కు బాధ్యతలు అప్పజెప్పి, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని ఊహాగాగాలు వస్తున్నాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..