ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై గుర్తు తెలియని వ్యక్తులు గుడ్డు విసిరారు. బెంగళూరు పశ్చిమ ప్రాంతంలో ఉన్న లగ్గెరే, లక్ష్మీదేవి నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మునిరత్న పాల్గొన్న సమయంలో ఈ ఘటన జరిగింది.
కాంగ్రెస్ కార్యకర్తలే ఎమ్మెల్యేపై కోడిగుడ్లు విసిరారని బీజేపీ ఆరోపించింది. మునిరత్న ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా దాడికి పాల్పడ్డారని తెలిపారు.
వాజ్‌పేయి జయంతి వేడుకలకు హాజరైన తర్వాత మునిరత్న తన కారు వద్దకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఎమ్మెల్యే తన సహచరులు, పోలీసులతో కలిసి వెళుతున్న సమయంలో అతడి ఎదురున ఉన్న వ్యక్తులు గుడ్డు విసిరడంతో అది ఆ ఎమ్మెల్యే తలపై పడింది.
A group of miscreants threw eggs at #BJP MLA #Munirathna during a BJP programme of celebrating the birth anniversary of #Vajpayee in #Bengaluru.
Police have detained 3 persons in connection with the incident.
MLA #Muniratna alleges #Congress workers attacked him.
The… pic.twitter.com/0SliHapHr6
— Hate Detector 🔍 (@HateDetectors) December 25, 2024