Rajasthan : బోరుబావిలో ప‌డిన మూడేళ్ల చిన్నారి.. 70 గంట‌లుగా జీవన పోరాటం.. రంగంలోకి ర్యాట్ హోల్ మైన‌ర్స్‌..

రాజస్థాన్‌లోని కోట్‌పుట్లీలో మూడేళ్ల చిన్నారి చేత‌న‌ బోరుబావిలో ప‌డిపోయింది.

Rajasthan : బోరుబావిలో ప‌డిన మూడేళ్ల చిన్నారి.. 70 గంట‌లుగా జీవన పోరాటం.. రంగంలోకి ర్యాట్ హోల్ మైన‌ర్స్‌..

pic credit @ ani twitter

Updated On : December 26, 2024 / 1:19 PM IST

Child fell into Borewell : రాజస్థాన్‌లోని కోట్‌పుట్లీలో మూడేళ్ల చిన్నారి చేత‌న‌ బోరుబావిలో ప‌డిపోయింది. గ‌త 70 గంట‌లుగా ఆ చిన్నారిని జీవన పోరాటం చేస్తోంది. ఆ చిన్నారిని ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నాల‌ను వేగ‌వంతం చేశారు. ర్యాట్ హోల్ మైన‌ర్ల‌ను రంగంలోకి దింపిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

కోట్‌పుట్లీ జిల్లాలో సోమ‌వారం త‌న తండ్రి పొలంలో చేత‌న అనే మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ ఉంటోంది. మ‌ధ్యాహ్న‌ స‌మ‌యంలో బాలిక 700 అడుగుల లోతు గ‌ల బోరుబావిలో ప్ర‌మాద‌వ‌శాత్తు ప‌డిపోయింది. తొలుత బాలిక 15 అడుగుల లోతు వ‌ద్ద చిక్కుకుపోయింది. కుటుంబ స‌భ్యులు ఆమెను కాపాడేందుకు చేసిన ప్ర‌య‌త్నాల‌తో బాలిక 150 అడుగుల లోతు వ‌ర‌కు జారిపోయింది. కుటుంబ స‌భ్యులు స‌మాచారంతో అధికారులు అక్క‌డకు చేరుకున్నారు.

AAP: ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ను తొలగించేందుకు ఇతర విపక్ష పార్టీలతో చర్చలు జరుపుతాం: ఆప్ వర్గాలు

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్), స్థానిక పరిపాలన బృందాలు బాలిక‌ను ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. బోరు బావికి స‌మాంత‌రం ఇప్ప‌టి వ‌ర‌కు 160 అడుగుల గొయ్యిని తవ్వారు. బాలిక‌ను ర‌క్షించేందుకు ఆ గొయ్యి నుంచి బోరుబావికి స‌మాంత‌రం రంధ్రాన్ని చేయ‌నున్నారు. అయితే.. మిష‌న్ల‌తో ఈ ప‌ని చెయ్య‌లేరని, మనుషులే త‌వ్వాల్సి ఉంటుంద‌ని అధికారులు చెబుతున్నారు.

ఈ క్ర‌మంలోనే ర్యాట్ హోల్ మైన‌ర్ల‌ను రంగంలోకి దించారు. ఉత్తరాఖండ్ సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించడంలో అనుభవం కలిగిన ఈ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. ఈరోజు చిన్నారిని బ‌య‌ట‌కు తీసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఎన్‌డీఆర్ఎఫ్ అధికారి యోగేశ్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

శాంతా క్లాజ్‌ డ్రెస్‌ ఎందుకు వేసుకున్నావ్‌? మరి దీపావళికి రాముడి డ్రెస్‌ వేసుకుంటావా? అంటూ ఏం చేశారో చూడండి..