శాంతా క్లాజ్‌ డ్రెస్‌ ఎందుకు వేసుకున్నావ్‌? మరి దీపావళికి రాముడి డ్రెస్‌ వేసుకుంటావా? అంటూ ఏం చేశారో చూడండి..

శాంతా క్లాజ్‌ డ్రెస్‌ వేసుకుని ఎందుకు ఫుడ్ డెలివరీ చేస్తున్నావని నిలదీశారు.

శాంతా క్లాజ్‌ డ్రెస్‌ ఎందుకు వేసుకున్నావ్‌? మరి దీపావళికి రాముడి డ్రెస్‌ వేసుకుంటావా? అంటూ ఏం చేశారో చూడండి..

Updated On : December 26, 2024 / 8:32 AM IST

Food Delivery Man: క్రిస్‌మస్‌ సందర్భంగా ఓ జొమాటో డెలివరీ బాయ్‌ శాంతా క్లాజ్‌ డ్రెస్‌ వేసుకుని ఫుడ్‌ డెలివరీ చేశాడు. అయితే, అతడిని పట్టుకున్న ఓ హిందూ సంఘం సభ్యులు.. శాంతా క్లాజ్‌ డ్రెస్‌ వేసుకుని ఎందుకు డెలివరీ చేస్తున్నావని నిలదీశారు.

క్రిస్‌మస్‌ అయితే శాంతా క్లాజ్‌ డ్రెస్‌ ఎందుకు వేసుకుంటావు? మరి దీపావళికి రాముడి డ్రెస్‌ వేసుకుంటావా? అని అన్నారు. చివరకు ఆ డెలివరీ బాయ్‌తో శాంతా క్లాజ్ దుస్తులను విప్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఫుడ్‌ డెలివరీ ఆర్డర్‌ తీసుకువెళ్తున్న డెలీవరీ బాయ్‌కి ఈ అనుభవం ఎదురైంది. ‘హిందూ జాగరణ్ మంచ్’ జిల్లా కన్వీనర్ సుమిత్ హార్దియా జొమాటో డెలివరీ ఏజెంట్‌ను అడ్డుకుని ఈ చర్యకు పాల్పడినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది.

“నువ్వు శాంతా క్లాజ్ లా డ్రెస్‌ వేసుకుని ఆర్డర్‌ని అందజేస్తున్నావా? నువ్వు ఎప్పుడైనా దీపావళి రోజున శ్రీరాముడి వేషధారణలో ప్రజల ఇళ్లకు వెళ్లావా” వంటి ప్రశ్నలను సుమిత్‌ అడిగాడు.

“మనం హిందువులం.. ఇటువంటి పనులతో మన పిల్లలకు ఏం సందేశం ఇస్తున్నాం? నువ్వు శాంతాక్లాజ్ వేషధారణలో ఉంటేనే ప్రజలకు మంచి సందేశాన్ని ఇవ్వగలవా? నువ్వు నిజంగా మంచి సందేశం ఇవ్వాలనుకుంటే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్‌లా దుస్తులు ధరించు. అధిక ఫుడ్‌ డెలివరీ ఆర్డర్లు హిందువుల నుంచే వస్తాయి. భారత్‌ హిందూ దేశం” అని సుమిత్ అన్నాడు.

Cm Chandrababu Naidu : అటానమస్ డ్రోన్ల సాయంతో సెక్యూరిటీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతలో మార్పులు..