Breathless Song Viral
Breathless Song Viral : సింగర్, కంపోజర్ శంకర్ మహదేవన్ తెలియని వారుండరు. 1998 లో ఆయన పాడిన బ్రీత్ లెస్ సాంగ్‌ను ఎవరూ మర్చిపోలేరు. ఆయనలా ఇప్పటి వరకూ పాడిన వారు లేరు. కానీ ప్రయత్నం చేసిన వారు చాలామంది ఉన్నారు. తాజాగా సింగర్ ఎజాజ్ హైదర్ బ్రీత్ లెస్ సాంగ్ పాడి నెటిజన్స్ మనసు దోచుకున్నాడు.
1998 లో శంకర్ మహదేవన్ ‘బ్రీత్ లెస్’ సాంగ్ ఇండీ-పాప్ ఆల్బమ్‌లో భాగంగా రిలీజైంది. ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్‌తో కలిసి మహదేవన్ ఈ ఆల్బమ్‌ను రూపొందించారు. అదే సంవత్సరంలో స్క్రీన్ అవార్డ్స్‌లో బెస్ట్ నాన్-ఫిల్మ్ ఆల్బమ్‌ను గెలుచుకుంది. బ్రీత్ లెస్ అనే పాటను శంకర్ మహదేవన్ లాగ అంతే స్పీడ్‌గా పాడాలని చాలామంది సింగర్స్, ఔత్సాహికులు ప్రయత్నం చేశారు. ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా సింగర్ ఎజాజ్ హైదర్ పాడిన “బ్రీత్‌లెస్” సాంగ్ నెటిజన్లను ఫిదా చేసింది. మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది.
Mumbai : ముంబయి లోకల్ ట్రైన్‌లో ‘కాంత లగా’ పాట పాడుతూ డ్యాన్స్ చేసిన ప్రయాణికులు
ఎజాజ్ హైదర్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో (ejazhaidermusic) తను పాడిన బ్రీత్ లెస్ సాంగ్ షేర్ చేశారు. నా వెర్షన్ నచ్చితే లైక్, షేర్ చేయండి అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అతని పాటకు నెటిజన్ల GIFల వర్షం కురుస్తోంది. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆ పాటను బీట్ చేసేలా ఎవరు పాడలేకపోయినా ప్రయత్నం అయితే చేస్తూనే ఉండటం విశేషం.