పాటలకు యువత చేసే డ్యాన్స్ వీడియోలు ఇంటర్నెట్‌లో బోలెడు దొరుకుతాయి. వృద్ధులకు డ్యాన్స్ చేసే ఓపిక, బలం ఉండదు. అయినప్పటికీ ఓ వృద్ధ దంపతులు డ్యాన్స్ చేశారు. “ఛోడ్ దో ఆంచల్ జమానా క్యా కహేగా” అనే బాలీవుడ్ పాటకి ఆ వృద్ధ దంపతులు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.
ఈ వీడియోను ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్వేతా పంచోలి తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయగా, అతి తక్కువ టైంలోనే కొన్ని మిలియన్ల వ్యూస్‌ను సంపాదించింది. వృద్ధ దంపతుల డ్యాన్స్ ను చూసిన ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వులు వెలిగాయి.
వీడియో ప్రారంభంలో కొరియోగ్రాఫర్ వారికి సరైన బీట్‌లో డ్యాన్స్ ప్రారంభించమని సూచనలు ఇవ్వడం వీడియోలో స్పష్టంగా కనపడుతుంది. పాటలోని ప్రతి పదానికి భావపూరితంగా వృద్ధులు డ్యాన్స్ చేశారు.
వారు పాటలోని పదాలకు తగిన భంగిమల్లో డ్యాన్స్ చేయడం అక్కడున్న వారిని ఆశ్చర్యపర్చింది. ముఖంలో చిరునవ్వుతో అందరినీ ఆ వృద్ధ దంపతులు ఆకట్టుకున్నారు.ఇలాంటి వీడియోల గురించి వివరించి చెప్పడం కష్టమే.. మీరు కూడా చూసేయండి..