Air India Flight : ఎయిర్ ఇండియా విమానంలో వృద్ధురాలిపట్ల ప్రయాణికుడు అసభ్య ప్రవర్తన.. సిబ్బంది ఏం చేశారంటే..

అమెరికా నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మద్యం మత్తులో అసభ్యకరంగా ప్రవర్తించాడు. 70ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. నవంబర్ 26న జరిగిన ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Air India Flight : ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణీకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో 70ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ దారుణ ఘటనతో ఒక్కసారిగా కంగుతిన్న ఆమె సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. గత ఏడాది నవంబర్ 26న ఈ ఘటన చోటు చేసుకోగా.. ఎయిర్ ఇండియా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానం జెఎఫ్‌కే (యూఎస్) నుంచి ఢిల్లీకి వస్తుంది.

ఇదిలాఉంటే.. ఈ ఘటనను వివరిస్తూ మహిళా వృద్ధురాలు.. టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌కు లేఖ రాయడంతో కేసు దర్యాప్తు కూడా ప్రారంభమైంది. అయితే, తనకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైన సమయంలో క్యాబిన్ సిబ్బంది చురుగ్గా వ్యవహచలేదని వృద్ధురాలు తన లేఖలో పేర్కొంది. సిబ్బంది నుంచి ప్రతిస్పందన పొందడానికి నేను చాలా సమయం వేచి చూడాల్సి వచ్చిందని లేఖలో ఫిర్యాదు చేసింది.

 

TATA Air India : 500 జెట్ లైనర్ విమానాలను కొనుగోలు చేయనున్న ఎయిరిండియా

 

భోజనం తర్వాత లైట్లను డిమ్ చేసిన సమయంలో ఈఘటన జరిగింది. తనపై మూత్రం పోయడం వల్ల తన దుస్తులు, బ్యాగ్, షూ తడిసినట్లు ఆమె ఆరోపించింది. విమానంలో సిబ్బంది తనకు దుస్తులు, చప్పులను ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఫస్ట్ క్లాస్‌లో చాలా సీట్లు ఖాళీగా ఉన్నా.. సిబ్బంది సీటులో ప్రయాణించాల్సి వచ్చిందని ఆమె వాపో్యింది. ఈ విషయంపై ఎయిర్ ఇండియా అధికారి మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రయాణీకులను నో ప్లే లిస్ట్ లో ఉంచాలని సిఫార్సు చేసింది. ఈ విషయం ప్రభుత్వ కమిటీ కింద ఉందని, నిర్ణయం కోసం వేచి ఉందని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎయిర్ ఇండియా దృష్టి సారించాయి. విమానయాన సంస్థ నుంచి నివేదిక కోరుతున్నామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని డీజీసీఏ తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు