Social Media: ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది అవుతోంది.. సోషల్ మీడియాపై ఎన్నికల సంఘం బాస్ అసంతృప్తి
జర్మనీ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి అన్నాలేనా బేర్‌బాక్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆమె నేతృత్వంలోని బృందం.. తాజాగా దిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో సమావేశమయ్యింది. ఈ సందర్భంగా దేశంలో ఎన్నికల నిర్వహణ తీరును ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా మొత్తం 95 కోట్ల ఓటర్లు, 11లక్షల పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు ఆయన తెలిపారు

Election Commission boss is unhappy with social media
Social Media: స్వేచ్ఛా ఎన్నికల నిర్వహణకు సోషల్ మీడియా ఇబ్బందిగా పరిణమించిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య కథనాలు ఇబ్బందిగా మారుతున్నాయని, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో ఇది ప్రధాన సవాల్‌గా మారుతోందని, ఇది నానాటికీ పెరుగుతోందని ఆయన అన్నారు. జర్మనీ విదేశాంగశాఖ బృందంతో మంగళవారం సమావేశమైన ఆయన.. ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేది భారత చరిత్ర, సంప్రదాయాల్లో భాగంగా ఉందని పేర్కొన్నారు.
జర్మనీ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి అన్నాలేనా బేర్‌బాక్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆమె నేతృత్వంలోని బృందం.. తాజాగా దిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో సమావేశమయ్యింది. ఈ సందర్భంగా దేశంలో ఎన్నికల నిర్వహణ తీరును ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా మొత్తం 95 కోట్ల ఓటర్లు, 11లక్షల పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల విధుల్లో కోటి మంది సిబ్బంది ఉంటారని, ప్రతి స్థాయిలోనూ రాజకీయ పార్టీల భాగస్వామ్యం ఉంటుందని వివరించారు. వీటితోపాటు ఎన్నికల ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని తెలియజేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రిని తరలించడాన్ని పక్కనబెడితే, ప్రతి ఎన్నికల్లోనూ సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య వార్తలు నిష్పాక్షిక ఓటింగుకు అడ్డంకిగా మారడం పెరుగుతోందని రాజీవ్ కుమార్ అన్నారు.
ఇక జర్మనీ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి అన్నాలేనా మాట్లాడుతూ భిన్న సవాళ్లు ఎదురైనప్పటికీ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలను సజావుగా నిర్వహిస్తున్న తీరుపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన నమూనా పోలింగ్‌లో పాల్గొని ఈవీఎంలో ఓటు వేశారు. ఈవీఎంల పనితీరు, వాటిలో భద్రతా ప్రమాణాలు, స్టోరేజీలకు సంబంధించి అంశాలను ఆమెతోపాటు వారి ఎంపీల బృందం పరిశీలించింది.