Five States Election : బహిరంగసభలు, ర్యాలీలు కొనసాగింపు ? ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ

వైరస్ మరింత ఉధృతం అవడం..మళ్లీ కేసులు పెరగడంతో...జనవరి 22 వరకు పొడిగిస్తూ..నిర్ణయం తీసుకుంది. పొడిగించిన నిషేధాజ్ఞలు నేటితో ముగియనున్నందున కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు...

Election Commission : ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అయితే..ప్రచార విషయంలో సందిగ్ధత నెలకొంది. ఓ వైపు కరోనా..మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తుండడంతో కేంద్ర ఎన్నికల సంఘం పలు నిబంధనలు, ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఐదు రాష్ట్రాల్లో బహిరంగసభలు, ర్యాలీలపై నిషేధం కంటిన్యూ అవుతోంది. ఇటీవలే జరిగిన సమావేశంలో నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈసీ విధించిన గడువు 2022, జనవరి 22వ తేదీ శనివారంతో ముగియనుంది. ఈ క్రమంలో..భౌతిక ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధాన్ని మళ్లీ పొడిగించాలా ? లేక అనుమతించాలా ? అనే అంశంపై అధికారులు వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Read More : Dalitbandhu : తెలంగాణ వ్యాప్తంగా దళితబంధు అమలు

రోడ్ షోలు, భౌతిక ర్యాలీలు, బైక్ ర్యాలీలు వంటి ప్రచార కార్యక్రమాలపై నిషేధం విధించడంతో పార్టీలన్నీ వర్చువల్ వాటిపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. జనవరి 15వ తేదీ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తొలుత ఈసీ వెల్లడించింది. అనంతరం వైరస్ మరింత ఉధృతం అవడం..మళ్లీ కేసులు పెరగడంతో…జనవరి 22 వరకు పొడిగిస్తూ..నిర్ణయం తీసుకుంది. పొడిగించిన నిషేధాజ్ఞలు నేటితో ముగియనున్నందున కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కేంద్ర, ఆరోగ్య శాఖ, వైద్య రంగ నిపుణులు, ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల అధికారులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్లీ నిషేధాజ్ఞలు పొడిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు జనవరి 08న షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు