Election Commission: తెలంగాణలోసహా ఐదు రాష్ట్రాలకు మోగనున్న ఎన్నికల సైరన్.. మరికొద్ది గంటల్లో తేదీలు ప్రకటించనున్న సీఈసీ

దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సైరన్ మోగించేందుకు సిద్ధమైంది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రంతోపాటు..

Election Commission Of India

Telangana Assembly Elections 2023 Schedule : దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సైరన్ మోగించేందుకు సిద్ధమైంది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రంతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గడ్, మిజోరం రాష్ట్రాలు కూడా ఉన్నాయి. సోమవారం మధ్యాహ్నం 12గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని ఆల్ ఇండియా రేడియో రంగ్ భవన్ ఆడిటోరియంలో జరిగే ప్రెస్ మీట్లో ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించనుంది. ప్రధాన ఎన్నికల కమీషనర్ తో పాటు ఎన్నికల కమిషన్ లోని కీలక అధికారులు హాజరుకానున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.

Read Also : Gold Price Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే?

2024లో దేశంలో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు ముందు ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు సెమీ పైనల్స్ గా పరిగణిస్తున్నారు. వీటిలో ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలు ఉండగా.. దక్షిణ భారతదేశంలో తెలంగాణ, ఈశాన్య భారతంలో మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సీఈసీ సిద్ధమైంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది జరగబోయే లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ఇదిలాఉంటే.. తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలుండగా.. ఛత్తీస్ గడ్ లో మాత్రం రెండు విడుతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Read Also : Amit Shah : అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యుల్ ఖరారు, ఒకేరోజు రెండు సభలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికేనియోజకవర్గాల వారిగా అభ్యర్థులను ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల లిస్ట్ ను సిద్ధం చేసుకున్నాయి. విడతల వారిగా అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. మరో రెండుమూడు రోజుల్లో ఇరు పార్టీలకు సంబంధించిన తొలి జాబితా విడుదల కానుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు సీఈసీ సిద్ధమవ్వడంతో రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం నెలకొంది.

రాష్ట్రాల వారిగా అసెంబ్లీ స్థానాలను పరిశీలిస్తే.. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 230, రాజస్థాన్ రాష్ట్రంలో 200, ఛత్తీస్ గఢ్ లో 90, మిజోరాంలో 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిల్లో ఎన్నికలకు సీఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది.

ట్రెండింగ్ వార్తలు