Election Commission : అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పెంచిన ఎన్నికల సంఘం

ఎన్నికలలో ఖర్చు పరిమితిని ఎన్నికల సంఘం పెంచింది. లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు అభ్యర్థుల ఎన్నికల ఖర్చు గరిష్ట పరిమితి 70 లక్షలుగా ఉండగా ఇప్పుడు దానిని 95 లక్షలకు పెంచారు.

Election Commission : ఎన్నికలలో ఖర్చు పరిమితిని ఎన్నికల సంఘం పెంచింది. లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు అభ్యర్థుల ఎన్నికల ఖర్చు గరిష్ట పరిమితి 70 లక్షలుగా ఉండగా ఇప్పుడు దానిని 95 లక్షలకు పెంచారు. అదే సమయంలో కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ పరిమితి రూ.54 లక్షలు ఉండగా.. దాన్ని 75 లక్షలకు పెంచారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఖర్చు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 28 లక్షలుగా పరిమితిని 40 లక్షలకు పెంచారు.

చదవండి : Punjab Election : 15 నిమిషాలకే మోదీకి ఇబ్బంది..రైతులకు ఏడాది కష్టం!

ఎన్నికల వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ఎన్నికల సంఘం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సూచనల ఆధారంగా ఈ పెంపుదల జరిగింది. ద్రవ్యోల్బణం రేటును దృష్టిలో ఉంచుకుని, రాజకీయ పార్టీల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ పెంపుదల జరిగింది. ఈ పెంపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలు కానుంది.

చదవండి : UP Elections : కాంగ్రెస్ కీలక నిర్ణయం.. యూపీలో సభలు, సమావేశాలు రద్దు

మరోవైపు, ఎన్నికల సంఘం గురువారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి, ఆరోగ్య నిపుణులతో కోవిడ్ పరిస్థితిని సమీక్షించింది. ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాల్లోని ఓటర్లతోపాటు సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలనీ తెలిపింది. దీంతో పాటు ఎన్నికల ప్రచారం, ఓటింగ్ సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలకు సంబంధించి వైద్య నిపుణుల నుంచి కమిషన్ సూచనలు తీసుకుంది.

చదవండి : Assembly Elections : వచ్చే వారమే..5 రాష్ట్రాల ఎన్నికల తేదీలపై ఈసీ ప్రకటన!

మరో సమావేశంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితిపై కూడా కమిషన్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాతో చర్చించింది. ఇక మరికొద్ది రోజుల్లో కమిషన్ పోలింగ్ తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. అంతకుముందు డిసెంబరు 27న కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్నికల సంఘంతో సమావేశమయ్యారు. చర్చ సందర్భంగా, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో టీకాలు వేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని కోరింది.

ట్రెండింగ్ వార్తలు