Elections Results 2024 : అధికారమే లక్ష్యంగా బీజేపీ బిగ్ ఫైట్.. మిత్రపక్షాలే మైనస్.. ‘టార్గెట్ 370 మిస్’..!

Elections Results 2024 : 2019 లోక్‌సభ ఎన్నికల్లో 303 సీట్లు గెలిచిన బీజేపీ తన లక్ష్యాన్ని 370గా నిర్దేశించుకుంది. ఈరోజు సాయంత్రం 7గంటలకు జరిగిన కౌంటింగ్ ట్రెండ్స్‌లో బీజేపీ 241 స్థానాల్లో ఆధిక్యత కనబరిచింది.

Elections Results 2024 : 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగిన బీజేపీ ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకుంది. అనుకున్న లక్ష్యాలను సాధించుకోవడానికి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌ (NDA)కు 400 సీట్లు, బీజేపీ సొంతంగా 370 సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకుంది.

అయితే, బీజేపీ భారీ అంచనాలను సాధించలేకపోయింది. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన నాలుగు గంటల తర్వాత భారీ గణాంకాలను సాధించింది. బీజేపీ దూకుడుకు తగ్గట్లుగా ట్రెండ్‌లు కూడా అలానే చూపించాయి.  కానీ, ఆ తర్వాత క్రమంగా బీజేపీ జోరు తగ్గుతూ వచ్చింది.

Read Also : Kangana Ranaut : కంగనా రివర్స్ కౌంటర్.. మీరే బ్యాగ్స్ సర్దుకుని వెళ్లిపోండి.. భారీ విజయం దిశగా బాలీవుడ్ క్వీన్!

ఈసారి ఎన్నికల్లో నిర్దేశిత 370 టార్గెట్ సాధించేందుకు కమలం పార్టీ తీవ్రంగా శ్రమించినప్పటికీ మిత్రపక్షాలైన ఎన్డీఏ కూటమికి గతంలో కన్నా తక్కువగా సీట్లు రావడం మైనస్‌గా మారింది. ఫలితంగా ఈరోజు సాయంత్రం 7 గంటల సమయానికి ఎన్డీయే 293 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 241 స్థానాల్లో ఆధిక్యత కనబర్చింది.

గత ఎన్నికలతో పోల్చి చూస్తే.. :
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా బరిలో నిలిచి ఎన్డీఏ కూటమికి బలమైన మద్దతు ఇచ్చింది. ఈ క్రమంలో బీజేపీ సొంతంగా 303 సీట్లు గెలుచుకుంది. వాస్తవానికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్కు 272 కన్నా ఎక్కువే. మొత్తంగా, 2019లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మొత్తం 353 సీట్లు గెలుచుకుంది. అంటే.. దాదాపు 65.1 శాతం (353/542) రికార్డును నమోదు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన మొత్తం సీట్లలో పార్టీ లేదా కూటమి గెలుచుకున్న సీట్ల వాటాను ఇది సూచిస్తుంది.

మొత్తం పోలైన ఓట్లలో బీజేపీకి 37.36 శాతం, ఎన్డీఏకి దాదాపు 45 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే ఓట్ల శాతం స్వల్పంగా పెరిగినట్లు ట్రెండ్‌లు వెల్లడిస్తున్నాయి. రాత్రి 7 గంటలకు ట్రెండ్స్‌ను లెక్కించగా ఎన్‌డీఏ 45 శాతం ఓట్లను సాధించింది. 2019లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చిన రెండు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో స్థానాల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది.

యూపీలోని 80 స్థానాలకుగాను 62, మహారాష్ట్రలోని 48 స్థానాలకుగాను 23 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అయితే, ఈసారి ఎన్డీఏ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 35 ఆధిక్యంలో ఉంది. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లతో కూడిన ఇండియా కూటమి 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Read Also : Elections Results 2024 : ఈ లోక్‌సభ ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూస్తున్న అభ్యర్థులు వీరే.. ఎవరెవరు ఉన్నారంటే?

ట్రెండింగ్ వార్తలు