Electric Bike Explodes : బాంబులా పేలిన ఎలక్ట్రిక్ బైక్.. తండ్రి, కూతురు మృతి

రాత్రి స్కూటర్ కు ఛార్జింగ్ పెట్టి తండ్రి, కూతురు నిద్రించారు. ఇంతలో దారుణం జరిగింది. ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ బాంబులా పేలిపోయింది.(Electric Bike Explodes)

Electric Bike Explodes : పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. రోజురోజుకి పెరిగిపోతున్న ఇంధన ధరలతో వాహనదారులు విలవిలలాడిపోతున్నారు. దీంతో అంతా ప్రత్యామ్నాయలపై దృష్టి పెట్టారు. పెట్రోల్, డీజిల్ కొనే పని లేని వాహనాలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఎలక్ట్రిక్ బైక్ లను కొనుగోలు చేస్తున్నారు. వీటికి ఫ్యూయల్ అవసంర లేదు. ఛార్జింగ్ పెడితే చాలు. దీంతో ఒక్కసారిగా ఎలక్ట్రిక్ బైక్ లకు ఆదరణ పెరిగింది. ఇటీవలి కాలంలో వీటి సేల్స్ విపరీతంగా పెరిగాయి. అయితే, కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రిక్ బైక్స్ ప్రాణాంతకంగా మారుతున్నాయి. బాంబుల్లా పేలిపోతున్నాయి. బ్యాటరీలో మంటలు చెలరేగి కాలిపోతున్నాయి. వీటి కారణంగా నిండు ప్రాణాలు బలైపోతున్నాయి.

తాజాగా తమిళనాడు రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ బాంబులా పేలిపోయింది. ఈ ఘటనలో తండ్రి, కూతురు మృతి చెందారు. వేలూరు జిల్లాలోని అల్లాపురం ప్రాంతానికి చెందిన దురై వర్మ (49) కేబుల్ టీవీ ఆపరేటర్ గా పని చేస్తున్నారు. ఆయన కుమార్తె ప్రీతి (13) ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం దురై వర్మ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశాడు.(Electric Bike Explodes)

OMG : పిల్లల చేతుల్లో పేలిన సెల్‌ఫోన్ బ్యాటరీ

శుక్రవారం రాత్రి స్కూటర్ కు ఛార్జింగ్ పెట్టి తండ్రి, కూతురు నిద్రించారు. ఇంతలో దారుణం జరిగింది. ఎలక్ట్రిక్ బైక్‌ బ్యాటరీలో మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత పేలిపోయింది. కాగా, కొత్త ఎలక్ట్రిక్ బైక్‌తో పాటు పక్కనే పార్క్ చేసిన పెట్రోల్‌తో నడిచే మరో బైక్‌కు మంటలు అంటుకోవడంతో ఇల్లంతా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తండ్రి, కూతురు మరణించారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. నిద్రపోతున్న తండ్రి, కూతురు ఎలక్ట్రిక్ బైక్‌ కారణంగా శాశ్వత నిద్రలోకి వెళ్లిపోవడంతో స్థానింగా విషాదం అలుముకుంది. కాగా, ఓవర్ ఛార్జింగ్ కారణంగా బైక్ పేలిపోయినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వస్తువులు ఎంత సౌకర్యంగా పని చేస్తాయో.. వాటితో అంతే ప్రమాదం పొంచి ఉంటుందనేది మరోసారి రుజువైందని స్థానికులు అంటున్నారు. ఎలక్ట్రిక్ వస్తువు ఏదైనా అధికంగా ఛార్జింగ్ పెడితే ప్రాణాలు పోయేంత ప్రమాదం తలెత్తుతుందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం అంటున్నారు.

బైక్ పేలిపోవడం, దాని పక్కనే ఉన్న మరో బైక్ కు మంటలు అంటుకోవడం, ఇల్లంతా మంటలు వ్యాపించడం క్షణాల్లో జరిగిపోయాయి. పేలుడు ధాటికి ఇల్లంతా పొగలు కమ్ముకున్నాయి. బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో ఇంట్లోని బాత్ రూమ్ లో తండ్రి, కూతురు దాక్కున్నారు. చివరకు ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు. ఇంటి చుట్టు పక్కల ఉన్న వాళ్లు మంటలు ఆర్పి తండ్రి, కూతురిని కాపాడేందుకు ప్రయత్నం చేశారు. అయితే, మంటలు ఇంటి చుట్టూ వ్యాపించడం, లోపలికి వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో స్థానికులు కాపాడలేకపోయారు.

Cheapest Electric Car : ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు.. త్వరలో విడుదల

మండిపోతున్న ఇంధన ధరల నుంచి ఊరట పొందేందుకు దురై వర్మ ఇటీవలే రూ.95వేలకు ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశారు. ఇక అంతా హ్యాపీ అనుకున్నారు. కానీ, ఇంతలోనూ ఊహించని ఘోరం జరిగిపోయింది. బైక్ కొన్న కొన్ని గంటల వ్యవధిలోనే దాని కారణంగా తండ్రి, కూతురు ప్రాణాలు కోల్పోవడం సంచలనం రేపింది.

ట్రెండింగ్ వార్తలు