Energy Drink Drinking
energy drink addiction is also fatal : మార్కెట్‌లో ఎన్నో రకాల ఎనర్జీ డ్రింక్స్ యువతను ఆకట్టుకుంటున్నాయి. ఎనర్జీ డ్రింగ్ టిన్ చేత్తో పట్టుకుని తాగుతుంటే స్టైల్ గా బాగానే ఉంటుంది. భలే మజాగానే ఉంటుంది. ఇవి తాగితే మాంచి ఉత్తేజం కూడా వస్తుంది. ‘ఒన్ మోర్ టిన్ ప్లీజ్’ అనాలనిపిస్తుంది. ఒక్కో సిప్ చేస్తూ తాగుతుంటే మజా మజాగా బాగానే ఉంటుంది. వీటిని తాగడం వల్ల మనం పొందేది ఎనర్జీ కాదు..అనారోగ్యం అని అని చెబుతున్నారు నిపుణులు. యువకుల చేతుల్లో ఎనర్జీ డ్రింక్స్ ఉండటం స్టేటస్ సింబల్‌గా మారటమంటే అది వారిని ఎంత బానిసలుగా మార్చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
మనం తీసుకునే టీ, కాఫీ, కోలా బెవరేజెస్, ఎనర్జీ డ్రింకుల్లో కెఫిన్ ఉంటుందో తాగేవారికి తెలీదు. అఫ్ కోర్స్ తెలిసినా తాగుతున్నారనుకోండీ. వాటిలో ఉండే కెఫిన్ అనే మత్తుపదార్థం వల్ల వాటిని మళ్లీ మళ్లీ తాగాలనిపించేలా చేస్తుందని దీంతో ఈ ఎనర్జీ డ్రింకులకు జనాలు బానిసలుగా మారుతున్నారని అంటున్నారు నిపుణులు. అమెరికాలో కంటే ఇండియాలోనే పెద్ద మొత్తంలో కెఫిన్ కలిగిన పానీయాలను తాగుతున్నట్లు యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇటీవల జరిపిన ఒక సర్వేలో తేలింది.అమెరికాలోని 12 నుంచి 16 ఏళ్ల వయసు వారు రోజూ 64.8 మి.గ్రా కెఫిన్ తీసుకొంటుండగా..అదే 17, 18 ఏళ్లవారు రోజు 96.1 మి.గ్రా తీసుకుంటున్నారు. అదే ఆస్ట్రేలియాలో అయితే 12 నుంచి 16 ఏళ్లవారు 109 మి.గ్రా. కెఫిన్ తాగేస్తున్నారు. కెనడాలో 8 నుంచి 12 ఏళ్ల వారు ప్రతీరోజూ 109 మి.గ్రా ఊదేస్తున్నారు..అదే తాగేస్తున్నారు.
అదే మన భారత యువత అయితే ఈ దేశాలన్నింటిని మించిపోయాం.ఏకంగా భారత్ యువత ప్రతీ రోజూ 121 మి.గ్రా కెఫిన్ తాగుతున్నట్లు తేలింది సర్వేలో. భారత్ లో విద్యార్ధులు 300 మి.గ్రా కన్నా ఎక్కువ కెఫిన్ కలిగిన డ్రింకులు తాగుతున్నట్లు సర్వే వెల్లడించింది. కెఫిన్ ఉన్న పానీయాలు తాగడం వల్ల ఉన్నఫళంగా ఉత్తేజితం అవుతామనేది నిజం. అయితే, 47.6 శాతం మంది అలర్ట్ కోసం తాగుతుంటే..32 శాతం మంది ఒత్తిడి దూరం చేసుకోవడానికి తాగుతున్నారని తేలింది. మరో 22.6 శాతం మంది ఏకాగ్రత కోసం తాగుతున్నారనీ..17.8 శాతం మంది తలనొప్పి నుంచి ఉపశమనం కోసం..14.4 శాతం మంది రెస్ట్ కోసం తాగుతున్నారని సర్వేలో తేలింది.
ఎనర్జీ డ్రింక్స్ తాగితే వచ్చే ఆరోగ్య సమస్యలు..?
ఎనర్జీ డ్రింక్స్‌లలో వాటర్ కంటెంట్ తో పాటు చక్కెర, కెఫిన్‌తో కొన్ని ఖనిజాలు, విటమిన్లు, పోషకాలు ఉంటాయి. ఒక ఔన్స్ ఎనర్జీ డ్రింక్‌లో 100 మి.గ్రా కెఫిన్ ఉంటుంది. అంటే దీంట్లో అన్నింటికంటే ఎక్కువగా ఉండేది మనిషికి హాని చేసే కెఫెన్ అనే విషయం గుర్తించాలి. ఈ కెఫెన్ సాధారణ కాఫీలో ఉండే 12 మి.గ్రా ల కన్నా 8 రెట్లు ఎక్కువగా ఎనర్జీ డ్రింక్ లో ఉంటుంది.
ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల..మానసిక ఆరోగ్య సమస్యలను పెంచే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు బ్లడ్ ప్రెషన్ పెరుగుతుంది. అలాగే స్థూలకాయం, మూత్రపిండాలు పాడైపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు దంతాలు చెడిపోతాయి. మధుమేహం వస్తాయి. అలాగే ఈ ఎనర్జీ డ్రింకులు తాగినప్పుడు ఉత్తేజంగా ఉంటుందే గానీ తరచూ తాగుతుంటే అలసట, కడుపులో నొప్పి, తలనొప్పి వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కెఫిన్ ఎక్కువైనట్లు ఎలా గుర్తించాలి..?
కెఫిన్ మన శరీరంలో ఎక్కువైనట్లు గుర్తించడానికి కొన్ని లక్షణాలు మనకు తెలుస్తాయి. వాటిని గుర్తించాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, డీహైడ్రేషన్, ఛాతీలో నొప్పి, హై టెంపరేచర్,గుండె కొట్టుకోవడంలో మార్పు, వాంతులు కావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.ఇటువంటి సమస్యలు గుర్తించి వెంటనే నిపుణులను సంప్రదించాలి. ఏది ఏమైనా ఎనర్జీ కావాలంటే చక్కటి పోషకాహారం తీసుకోవాలి తప్ప ఇటువంటి ప్రమాదక పానీయాలు తాగకుండా ఉండటం చాలా చాలా మంచిదనే విషయం ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.