Jacqueline Fernandez : సినీ పరిశ్రమలో కలకలం, హీరోయిన్‌ను విచారించిన ఈడీ

మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. బాలీవుడ్ నటి జాక్వలైన్ ఫెర్నాండేజ్‌ ను ఢిల్లీలో విచారించారు. దాంతో ఒక్కసారిగా బాలీవుడ్‌లో కలకలం రేగింది. ఇంకా

Jacqueline Fernandez : మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. బాలీవుడ్ నటి, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ ను సోమవారం ఢిల్లీలో విచారించారు. దాదాపు 5గంటలకు పైగా ఈ విచారణ కొనసాగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈడీ విచారణతో ఒక్కసారిగా బాలీవుడ్‌లో కలకలం రేగింది. ఇంకా పలువురు బాలీవుడ్ నటులను విచారించే అవకాశం ఉందనే వార్తలు హిందీ సినిమా పరిశ్రమలో ప్రకంపనలు రేపాయి.

SSC GD Constable 2021 : పది పాస్ అయితే చాలు, 25 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్

గతేడాది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత వెలుగు చూసిన అంశాల ఆధారంగా పెద్ద ఎత్తున్న ఈడీ అధికారులు బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేశారు. విదేశీ మారకం వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయనే విషయాన్ని గుర్తించారు. ఆ తర్వాత పలువురు ఖాతాలపై ఈడీ ఫోకస్ పెట్టి దర్యాప్తు చేపట్టింది.

Covid-19 Variant C.1.2 : వ్యాక్సిన్లూ పనిచేయని కొత్త వేరియంట్ వెలుగులోకి!

మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఈడీ అధికారులు ఈ ఏడాది జూలైలో బాలీవుడ్ నటి యామీ గౌతమ్‌కు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ముంబైలోని ఇంట్లో డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్న కేసులో బాలీవుడ్‌ నటుడు అర్మాన్‌ కోహ్లిని ఎన్‌సీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 1 వరకు ఎన్‌సీబీ కస్టడీలోకి తీసుకుంది.

ట్రెండింగ్ వార్తలు