Covid-19 Variant C.1.2 : వ్యాక్సిన్లు కూడా పనిచేయని కొత్త వేరియంట్ వెలుగులోకి!

దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఉన్న వైరస్ రకాలతో పోలిస్తే.. ఈ వేరియంట్ కు మ్యుటేషన్ రేటు అధికంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది.

Covid-19 Variant C.1.2 : వ్యాక్సిన్లు కూడా పనిచేయని కొత్త వేరియంట్ వెలుగులోకి!

Covid

Covid-19 Variant C.1.2 దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ c.1.2 ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఉన్న వైరస్ రకాలతో పోలిస్తే.. ఈ వేరియంట్ కు మ్యుటేషన్ రేటు అధికంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది.

దక్షిణాఫ్రికాకు చెందిన జాతీయ అంటువ్యాధుల సంస్థ(NICD) మరియు క్వాజులు-నేటల్ రీసర్చ్ ఇన్నోవేషన్స్ అండ్ సీక్వెన్సింగ్ ప్లాట్​ఫాం సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు చేప్టటిన పరిశోధనలో…దక్షిణాఫ్రికాలో కరోనా ఫస్ట్ వేవ్​లో తీవ్ర ప్రభావం చూపించిన C.1 రకంతో పోలిస్తే C.1.2 వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉందని తేలింది.

ఆందోళనకర వేరియంట్, వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్​తో పోలిస్తే C.1.2లో మ్యుటేషన్లు అధికంగా ఉన్నాయని… C.1.2 మ్యుటేషన్ రేటు 41.8 శాతం ఉందని తెలిపారు. అంటే సంవత్సరానికి 41.8 సార్లు వైరస్​లో మార్పులు సంభవిస్తాయని అర్థం. ప్రస్తుతం ఉన్న వైరస్ వేరియంట్ల మ్యుటేషన్ రేట్లతో పోలిస్తే ఇది రెట్టింపు కావడం ఆందోళనకరం.

C.1.2 రకం కరోనా.. వ్యాక్సిన్ నుంచి లభించిన ప్రొటెక్షన్(రక్షణ)ని ఎదిరించి మరీ వ్యాపిస్తున్నట్లు తేలింది. C.1.2 వేరియంట్ కేసులు చైనా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మారిషస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్ దేశాల్లో బయటపడ్డాయని శాస్త్రవేత్తలు తెలిపారు.