SSC GD Constable 2021 : పది పాస్ అయితే చాలు, 25 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్

సుమారు 25వేల కానిస్టేబుల్(జీడీ-జనరల్ డ్యూటీ) ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో(ఆగస్టు 31,2021) ముగియనుంది. ఆగస్టు 31 చివరి తేదీ అని, వెంటనే అప్లయ్ చేసుకోవాలని స్టాఫ్ సెలెక్షన్..

SSC GD Constable 2021 : పది పాస్ అయితే చాలు, 25 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్

Ssc Gd Constable 2021

SSC GD Constable 2021 : సుమారు 25వేల కానిస్టేబుల్(జీడీ-జనరల్ డ్యూటీ) ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో(ఆగస్టు 31,2021) ముగియనుంది. ఆగస్టు 31 చివరి తేదీ అని, వెంటనే అప్లయ్ చేసుకోవాలని స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్‌సీ) సూచించింది. దరఖాస్తు గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది. పదో తరగతి పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. వయసు : 18-23 సంవత్సరాలు. యువతీ యువకులు అప్లయ్ చేసుకోవచ్చు. https://ssc.nic.in/ ద్వారా అప్లయ్ చేసుకోవాలి. BSF, CISF, CRPF, ITBP, AR విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 25వేల 271
అర్హ‌త‌లు..
* ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ఆగస్టు 2, 1998 నుంచి ఆగస్టు 1, 2003 మ‌ధ్య జన్మించి ఉండాలి.
* ఓబీసీ అభ్య‌ర్థుల‌కు మూడేళ్ల వ‌యోప‌రిమితి.
* ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు ఐదేళ్లు వ‌యోప‌రిమితి స‌డ‌లింపు ఉంది.
* అభ్య‌ర్థులు గుర్తిపంపు పొందిన బోర్డు, యూనివ‌ర్సిటీ నుంచి మెట్రిక్యులేష‌న్ లేదా ప‌దోత‌ర‌గ‌తి (10th class) పాసై ఉండాలి.

SSC GD కానిస్టేబుల్ పరీక్ష 2021 కోసం పే స్కేల్:
పే లెవల్ -3 (రూ. 21700-69100).

ఎంపిక విధానం..
అభ్య‌ర్థులను కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష (CBT), ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్ (Physical Standards Test)‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, వైద్య పరీక్ష (Physical Efficiency Test and Medical Examination) ద్వారా ఎంపిక. కంప్యూట‌ర్ ప‌రీక్ష ఇంగ్లీష్‌, హిందీలో మాత్ర‌మే నిర్వ‌హిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 31లోగా https://ssc.nic.in/ వెబ్ సైట్ లో అప్లయ్ చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు రుసుం..
రుసుము రూ .100.
మ‌హిళ‌లు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్య‌ర్థులు, ఎక్స్ స‌ర్వీస్ మెన్‌కు ద‌ర‌ఖాస్తు ఫీజు మిన‌హాయింపు.

ముఖ్య‌మైన తేదీలు..
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఆగస్టు 31, 2021
ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: సెప్టెంబర్ 2, 2021
ఆఫ్‌లైన్ చలాన్ కోసం చివ‌రి తేదీ: సెప్టెంబర్ 7, 2021
చలాన్ ద్వారా చెల్లించడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 9