Sri Vatsava
Pankhuri Shrivastava: ఆన్‌లైన్‌లో రియల్ ఎస్టేట్ వ్యవహారాలను కస్టమర్లకు అందించే సంస్థ గ్రాబ్ హౌస్ ఫౌండర్ పంఖూరి శ్రీవాస్తవ కన్నుమూశారు. 32ఏళ్ల వయస్సులోనే గుండెపోటుతో శ్రీవాత్సవ మరణించారు. ఈ విషయాన్ని ఆమె కంపెనీ వెల్లడించింది. డిసెంబర్ 24వ తేదీ శుక్రవారమే ఆమె చనిపోయినట్లు సంస్థ ప్రకటించింది.
పంఖురి శ్రీవాస్తవ 2019 సంవత్సరంలో మహిళల సాధికారతకు సంబంధించిన వేదిక పంఖురిని ప్రారంభించారు. లైవ్ ఇంటరాక్టివ్ కోర్సులు, నిపుణుల చాట్‌లు మరియు ఆసక్తి-ఆధారిత క్లబ్‌ల ద్వారా నైపుణ్యాభివృద్ధిని మెరుగుపరచడానికి సంస్థ పనిచేస్తుంది. వెంచర్ క్యాపిటల్, టాప్ ఎగ్జిక్యూటివ్‌లు శ్రీవాత్సవ అకాల మరణానికి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.
సెక్వోయా క్యాపిటల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శైలేంద్ర సింగ్ మాట్లాడుతూ, పంఖూరికి చాలా గొప్ప ఆలోచనలు, అంతర్దృష్టి, ఉత్సాహం, సృజనాత్మకత ఉన్నాయని చెప్పారు. ఆమె మృతితో తీరని నష్టం వాటిల్లిందని అన్నారు.