EPFO : ఖాతాదారులకు అలర్ట్, అలా చేయకపోతే పీఎఫ్ డబ్బులు పడవు

ఖాతాదారులు అలర్ట్ కండి..తమ ఆధార్ కార్డును ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాలతో లింక్ చేసుకోవాలని..అలా చేయకపోతే..డబ్బులు పడవని పేర్కొంది. ఇందుకు కార్మిక మంత్రిత్వ శాఖ సామాజిక భద్రత - 2020 చట్టంలో సెక్షన్ 142కు సవరణలు చేసింది.

Epf

EPFO : ఖాతాదారులు అలర్ట్ కండి..తమ ఆధార్ కార్డును ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాలతో లింక్ చేసుకోవాలని..అలా చేయకపోతే..డబ్బులు పడవని పేర్కొంది. ఇందుకు కార్మిక మంత్రిత్వ శాఖ సామాజిక భద్రత – 2020 చట్టంలో సెక్షన్ 142కు సవరణలు చేసింది. సెక్షన్ 142 కింద ఉద్యోగులు ఇతర ప్రయోజనాలు, సేవలను పొందడం కోసం ఆధార్ నెంబర్ ను లింక్ చేయాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది.  పీఎఫ్ ఖాతాలకు ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలని గతంలో ఈపీఎఫ్ఓ (EPFO) సూచించిన సంగతి తెలిసిందే. ఆధార్ లింక్ గడువును 2021 జూన్ 01వ తేదీ నుంచి సెప్టెంబర్ 01వ తేదీ వరకు పెంచిన సంగతి తెలిసిందే. వచ్చే నెల నుంచి ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతాను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకపోతే…ఉద్యోగుల ఖాతాలో పీఎఫ్ డబ్బుల పడవని వెల్లడించింది.

Read More : Actress Sharada: నేను బతికే ఉన్నానని సీనియర్ నటి ఆవేదన!

ఎలా లింక్ చేయాలి ?

ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ (www.epfindia.gov.in) ఓపెన్ చేసి లాగిన్ కావాలి.
ఆన్ లైన్ సర్వీసెస్ పై క్లిక్ చేయాలి. అనంతరం ఈ – కెవైసీ పోర్టల్ కు వెళ్లి యుఎఎన్ (UAN) ఆధార్ లింక్ పై క్లిక్ చేయాలి.
యుఎఎన్ ఖాతాలో నమోదు చేసిన యుఎఎన్ నంబర్, మొబైల్ నెంబర్ ను నమోదు చేయాలి.
అనంతరం మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది. ఆ OTPని, 12 అంకెల ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాలి. ఫారమ్ ను సమర్పించాలి. తర్వాత…ఓటీపీ ధృవీకరణ ఎంపికపై క్లిక్ చేయండి.
ఆధార్ వివరాలను ధృవీకరించడానికి ఆధార్ లింక్ చేసిన మొబైల్ నెంబర్, మెయిల్ లో ఓటీపీ వస్తుంది. ధృవీకరణ తర్వాత…మీ పీఎఫ్ ఖాతాకు లింక్ చేయబడుతుంది.