Actress Sharada: నేను బతికే ఉన్నానని సీనియర్ నటి ఆవేదన!
ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడైనా మీడియా ముందుకో.. లేక సినిమాలలోనో.. లేక మరేదైనా కార్యక్రమాలలో అయినా నటీనటులు, సెలబ్రిటీలు కనిపిస్తుంటే ఒకే కానీ.. కనిపించని సందర్భంలో మాత్రం వారి గురించి ఆరా తీయడం సహజం. అయితే.. ఇప్పుడున్న సోషల్ మీడియా పుణ్యమా అని కొద్దిరోజులు ఎవరైనా సెలబ్రిటీలు కనిపించకపోతే.. వాళ్లకి ఏదో అయిపోయిందని.. మరికాస్త ముందుకెళ్లి చనిపోయారని కూడా ప్రచారం చేస్తున్నారు.

Actress Sharada
Actress Sharada: ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడైనా మీడియా ముందుకో.. లేక సినిమాలలోనో.. లేక మరేదైనా కార్యక్రమాలలో అయినా నటీనటులు, సెలబ్రిటీలు కనిపిస్తుంటే ఒకే కానీ.. కనిపించని సందర్భంలో మాత్రం వారి గురించి ఆరా తీయడం సహజం. అయితే.. ఇప్పుడున్న సోషల్ మీడియా పుణ్యమా అని కొద్దిరోజులు ఎవరైనా సెలబ్రిటీలు కనిపించకపోతే.. వాళ్లకి ఏదో అయిపోయిందని.. మరికాస్త ముందుకెళ్లి చనిపోయారని కూడా ప్రచారం చేస్తున్నారు. మరీ ముఖ్యం ఫేడ్ అవుట్ అయిన సీనియర్ నటుల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
ఇప్పటికే కమెడియన్స్ సుధాకర్, వేణుమాధవ్ వంటి వారి విషయంలో ఇదే జరిగింది. తాము ఆరోగ్యంగా బ్రతికే ఉన్నామని వాళ్ళే బయటకొచ్చి చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యాన్ని చూశాం. ఇక, ఇప్పుడు సీనియర్ నటీ, ఉత్తమ అవార్డు గ్రహీత ఊర్వశి శారద విషయంలో కూడా ఇదే జరిగింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ శారద ఎన్నో వందల సినిమాల్లో నటించారు. ఈమెకు అభిమానులు కూడా భారీ స్థాయిలోనే ఉన్నారు. ప్రస్తుతం 76 ఏళ్ళ శారద కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
అయితే, గత రెండు వారాలుగా శారద మరణించిందంటూ సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ వార్తతో ఆమె అభిమానులు కూడా కంగారు పడడమే కాకుండా తెలిసిన వారిద్వారా ఆరా తీయడం మొదలు పెట్టారు. అది కాస్త ఆమె వరకు చేరడంతో ఈ వార్తలపై ఆమె స్పందించారు. బ్రతికున్న తాను చనిపోయానని సృష్టించడం బాధాకరమని.. ఎవడో పనికిమాలిన వెధవ చేసిన పనికి అందరూ ఆందోళన చెందుతున్నారని.. తనకు మనస్శాంతి లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఆందోళన చెందుతున్న అభిమానులు ఫోన్ చేసి విలపిస్తున్నారని.. ఇది ఏ మాత్రం నిజం కాదని.. తాను సంపూర్ణంగా ఆరోగ్యంగా కుటుంబంతో కలిసి గడుపుతున్నానని చెప్పారు.