భారతీయులంతా గర్వించే రోజు: ప్రధాని మోడీ

  • Publish Date - September 6, 2019 / 10:53 AM IST

చంద్రయాన్‌-2లోని విక్ర‌మ్ ల్యాండ‌ర్ చంద్రుడిపై దిగననున్న అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు ప్రధాని మోడీ. ప్రపంచ దేశాల్లో భారత్ తలఎత్తుకునేలా చేసిన ఇస్రో సైంటిస్టులకు అభినందలు తెలిపారాయన.

సెప్టెంబర్ 6వ తేదీ అర్థరాత్రి తర్వాత.. తెల్లవారితే 7వ తేదీ 1:30 – 2:30 గంటల మధ్య విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగనున్న అద్భుతమైన, అరుదైన క్షణాలు చరిత్రలో లిఖించబడుతాయి. ప్రతి భారతీయుడు గర్వించే రోజు.. ఈ రోజు అంటూ దేశ ప్రజలను ఉద్దేశించి అన్నారు ప్రధాని మోడీ. చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతం మన శాస్త్రవేత్తల శక్తి ఏంటో ప్రపంచానికి తెలియజేస్తుందన్నారు మోడీ. చంద్రయాన్‌-2 పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడింది.. దీనికి ప్రతి భారతీయుడు సంతోషించాలి. రోవర్‌ చంద్రుని ఉపరితలంపై ఉండే పదార్థాలను విశ్లేషించనుంది అని మోడీ స్పష్టం చేశారు. 

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ర్టాల సీఎంలు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతున్నారు. అంతరిక్ష చరిత్రలో భారత్ విజయ సంతకాలు చేసేలా కృషి చేస్తున్న ఇస్రో సైంటిస్టులకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

శ్రీహరికోట నుంచి చంద్రయాన్-2 చారిత్రాత్మక ప్రయోగం భారతీయులందరికీ గర్వకారణమని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. భారతదేశ స్వదేశీ అంతరిక్ష పరిజ్నానాన్ని మరింత ముందుకు తెచ్చినందుకు భారత శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు అభినందనలు అంటూ కోవింద్ ట్విట్టర్ లో తెలిపారు. 

ఈ అద్భుతమైన క్షణాల గురించి కొన్ని ఏళ్లుగా ఇస్తో సైంటిస్టులతో పాటు ప్రతీ ఒక్క భారతీయుడు ఎదురు చూస్తున్నారు. విక్రమ ల్యాండర్ చంద్రుడిపైకి దిగనున్న సందర్భంగా బెస్ట్ ఆఫ్ లక్ విక్రమ్ అంటూ ఇస్రో ఓ కార్టూన్ ను పోస్ట్ చేసింది.