Ex Bihar MP : జంట హత్యల కేసులో మాజీ ఎంపీకి జీవిత ఖైదు…సుప్రీంకోర్టు సంచలన తీర్పు

1995వ సంవత్సరంలో జరిగిన జంట హత్యల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 1995లో తనకు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు ఇద్దరు వ్యక్తులను కాల్చి చంపినందుకు సింగ్ దోషిగా తేలారు....

Ex Bihar MP Prabhunath Singh

Ex Bihar MP : 1995వ సంవత్సరంలో జరిగిన జంట హత్యల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 1995లో తనకు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు ఇద్దరు వ్యక్తులను కాల్చి చంపినందుకు సింగ్ దోషిగా తేలారు. ఈ కేసు మన నేర న్యాయ వ్యవస్థలో అనూహ్యంగా బాధాకరమైన ఎపిసోడ్ అని సుప్రీంకోర్టు పేర్కొంది. (sentenced to life in 1995 double murder case)

One Nation, One Election : ఒకే దేశం, ఒకే ఎన్నికలను స్వాగతించిన కాంగ్రెస్ నేత

ఆగస్టు 18వతేదీన జస్టిస్‌లు సంజయ్‌ కిషన్‌ కౌల్‌, అభయ్‌ ఎస్‌ ఓకా, విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్‌ 302, 307 కింద మాజీ ఎంపీ సింగ్‌ను దోషిగా నిర్ధారించింది. (Ex Bihar MP Prabhunath Singh) ఈ కేసులో తీర్పును వెలువరిస్తూ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని బీహార్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వివరణాత్మక ఉత్తర్వులను అప్‌లోడ్ చేస్తామని సుప్రీం ధర్మాసనం తెలిపింది.

IAF Trishul exercise : పాక్, చైనా సరిహద్దుల్లో ఐఏఎఫ్ త్రిశూల్ విన్యాసాలు

1995వ సంవత్సరం మార్చిలో బీహార్‌లోని సరన్ జిల్లాలోని చప్రాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున ఇద్దరు వ్యక్తులను మాజీ ఎంపీ చంపారు. బీహార్‌లోని మహారాజ్‌గంజ్‌కు చెందిన మాజీ ఎంపీ అయిన సింగ్‌ను దోషిగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. సింగ్‌కు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను తుడిచిపెట్టడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలను చేయడంలో సింగ్ కీలక పాత్ర పోషించారని సుప్రీంకోర్టు పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు