IAF Trishul exercise : పాక్, చైనా సరిహద్దుల్లో ఐఏఎఫ్ త్రిశూల్ విన్యాసాలు

న్యూఢిల్లీలో జి-20 సదస్సు జరగనున్న నేపథ్యంలో పాకిస్థాన్, చైనా దేశాల సరిహద్దుల్లో భారతీయ వైమానిక దళం త్రిశూల్ పేరిట సైనిక విన్యాసాలు చేయనుంది. సెప్టెంబర్ 4 నుంచి 14వతేదీ వరకు చైనా, పాకిస్థాన్ సరిహద్దుల వెంట వైమానిక దళం శిక్షణ వ్యాయామం చేయనుంది....

IAF Trishul exercise : పాక్, చైనా సరిహద్దుల్లో ఐఏఎఫ్ త్రిశూల్ విన్యాసాలు

IAF

IAF Trishul exercise : న్యూఢిల్లీలో జి-20 సదస్సు జరగనున్న నేపథ్యంలో పాకిస్థాన్, చైనా దేశాల సరిహద్దుల్లో భారతీయ వైమానిక దళం త్రిశూల్ పేరిట సైనిక విన్యాసాలు చేయనుంది. సెప్టెంబర్ 4 నుంచి 14వతేదీ వరకు చైనా, పాకిస్థాన్ సరిహద్దుల వెంట వైమానిక దళం శిక్షణ వ్యాయామం చేయనుంది. (Air Force to carry out training exercise)

Neeraj Chopra : జూరిచ్ డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా 85.71 మీటర్ల త్రోతో రెండో స్థానం

లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, కాశ్మీర్, పంజాబ్‌తో సహా ఉత్తర సెక్టార్‌లోని పలు ప్రాంతాల్లో ఈ కసరత్తు నిర్వహించనున్నారు. (Pak, China border) రాఫెల్, మిరాజ్ 2000,సూ-30ఎంకేఐలతో సహా అన్ని ప్రధాన యుద్ధ విమానాలు ఈ డ్రిల్స్‌లో పాల్గొంటాయని భారతీయ వైమానిక దళం తెలిపింది. (amid G-20 Summit)

Pakistan : ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఆత్మాహుతి దాడి… 9 మంది పాక్ సైనికుల మృతి

ఈ ఫైటర్ జెట్‌లతో పాటు, చినూక్స్, అపాచీతో సహా భారీ-లిఫ్ట్ రవాణా విమానాలు, హెలికాప్టర్లు కూడా ఈ వ్యాయామంలో పాల్గొంటాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలైట్ యూనిట్ అయిన గరుడ్ స్పెషల్ ఫోర్సెస్ కూడా ఈ కసరత్తులో భాగం కానుంది.