One Nation, One Election : ఒకే దేశం, ఒకే ఎన్నికలను స్వాగతించిన కాంగ్రెస్ నేత

ఛత్తీస్‌గఢ్‌ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు టిఎస్‌ సింగ్‌ డియో శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సర్కారు ప్రతిపాదించిన ఒకే దేశం, ఒకే ఎన్నికలకు తాను అనుకూలమని టీఎస్ సింగ్ డియో చెప్పారు. ఒకే దేశం, ఒకే ఎన్నికను తాను స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు....

One Nation, One Election : ఒకే దేశం, ఒకే ఎన్నికలను స్వాగతించిన కాంగ్రెస్ నేత

Congress TS Singh Deo

One Nation, One Election : ఛత్తీస్‌గఢ్‌ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు టిఎస్‌ సింగ్‌ డియో శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సర్కారు ప్రతిపాదించిన ఒకే దేశం, ఒకే ఎన్నికలకు తాను అనుకూలమని టీఎస్ సింగ్ డియో చెప్పారు. ఒకే దేశం, ఒకే ఎన్నికను తాను స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. (Congress TS Singh Deo) అయితే ఈ కాన్సెప్ట్ కొత్తది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
వ్యక్తిగత స్థాయిలో తాను వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. (welcomes One Nation, One Election)

One Nation One Election: వన్ నేషన్ వన్ ఎలక్షన్.. ప్రయోజనాలు, సవాళ్లు ఏంటో తెలుసా?

ఒకే దేశం, ఒకే ఎన్నికల గురించి చర్చించడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిందని నివేదికలు వెలువడిన నేపథ్యంలో టీఎస్ సింగ్ డియో ఈ వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 18- 22 తేదీల మధ్య షెడ్యూల్ చేసిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఈ పరిణామం జరిగింది. సంవత్సరాల తరబడిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని ప్రతిపాదించారు.

Parliament Special Sessions: ఐదు రోజుల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చిన కేంద్రం.. ఇంత హడావుడిగా ఎందుకంటే?

ఐదు రోజుల పార్లమెంటు సెషన్‌కు సంబంధించిన ఎజెండాపై ఊహాగానాలు వ్యాపించాయి. ఊహాజనిత అంశాల్లో ప్రస్తుత పార్లమెంటు రద్దు, ముందస్తు లోక్‌సభ ఎన్నికల ప్రకటన కూడా ఉన్నాయి. సాధారణంగా అయితే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది మే, జూన్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.