IndiGo
IndiGo flights: ఈ విమానాలకు ఏమైంది? సాంకేతిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి? విమానాలు ఎందుకు ఆలస్యంగా నడుస్తున్నాయి? ఈరోజు వెళ్లాల్సిన ఫ్లైట్ వెళ్తుందా లేదా? ఫ్లైట్ జర్నీ చేస్తే ప్రయాణికులు అనుకున్న సమయానికి చేరుకుంటారా? ప్రయాణికుల బిజినెస్ మాటఏంటి? ఫ్లైట్లతో ఏర్పడే నష్టాన్ని ఎవరు పూడ్చుతారు? అసలు ఫ్లైట్ జర్నీలు సాఫీగా ఎప్పుడు సాగుతాయి?
ఫ్లైట్ జర్నీ చేస్తే టైమ్‌కు చేరుకుంటామని తమ పనులు సమయానికే చక్కబెట్టుకుంటామని అందరూ భావిస్తారు. అయితే, కొన్ని ఫ్లైట్లు ఇప్పుడు ఆలస్యంగా నడుస్తున్నాయి. సాంకేతిక సమస్యలు, సిబ్బంది కొరత వేధిస్తున్నాయి. వాతావరణ ప్రతికూలతలు కూడా వీటికి తోడవుతున్నాయి. దీంతో విమాన సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఒక చోట ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. (IndiGo flights)
దేశంలో 2 రోజుల్లో 300 విమాన సేవలు రద్దు కావడం పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందో వెల్లడిచేస్తోంది. భారతదేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్ ఇండిగో. దానికి చెందిన అనేక విమానాలు ఆలస్యమయ్యాయి. వేలాది మంది ప్రయాణికులు టెర్మినల్స్‌లో నిలిచిపోయారు. ఇది ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న తీవ్రమైన ఆపరేషన్ అంతరాయం.
Also Read: 19 ఇళ్లు, 700 కార్లు, 58 విమానాలు.. పుతిన్ ఆస్తుల చిట్టా.. చూస్తే మైండ్ బ్లాంక్
అకస్మాత్తుగా ఇలా ఎందుకు జరుగుతోంది? బుధవారం విడుదలైన ప్రకటనలో ఇండిగో పలు విషయాలు తెలిపింది. స్వల్ప టెక్నాలజీ సమస్యలు, శీతాకాల షెడ్యూల్ మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, విమాన వ్యవస్థ ట్రాఫిక్, క్రొత్త క్రూ రోస్టరింగ్ నిబంధనల (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్) అమలు కారణాల వల్ల విమానాల రద్దులు, ఆలస్యాలు జరిగాయని చెప్పింది..
షెడ్యూల్‌లలో మార్పులు చేసినట్టు, 48 గంటల్లో కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయని ఆ ఎయిర్‌లైన్ పేర్కొంది. “ప్రయాణికుల అసౌకర్యం తగ్గించేందుకు మా టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయి. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు లేదా రిఫండ్లు అందిస్తున్నాము” అని ఎయిర్‌లైన్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
రద్దుకు కారణాలు
ఎయిర్‌లైన్ తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్‌లో మొత్తం 1,232 విమానాలు రద్దు అయ్యాయి. క్రూ/ఎఫ్‌డిటిఎల్ కంప్లయెన్స్, ఎయిర్‌పోర్ట్/ఎయిర్‌స్పేస్/ఏటీసీ అంశాల వల్ల ఇలా జరిగింది. ఇవి ఎయిర్‌లైన్ నియంత్రణలో లేని అంశాలు. నవంబర్‌లో ఆన్‌టైమ్ పనితీరు 67.70% కాగా, అక్టోబర్‌లో 84.1%. 1,232 రద్దుల్లో 755 క్రూ/ఎఫ్‌డిటిఎల్ సమస్యలు, 92 ఏటీసీ, 258 ఎయిర్‌పోర్ట్/ఎయిర్‌స్పేస్ పరిమితులు, 127 ఇతర కారణాలు ఉన్నాయి.
క్రూ కొరత ఎందుకు?
నవంబర్ 1 నుంచి కొత్త కఠిన డ్యూటీ టైమ్ నిబంధనలు అమల్లోకి రావడంతో ఇండిగో భారీగా పైలట్, కేబిన్ క్రూ కొరతను ఎదుర్కొంటోంది. కొత్త నిబంధనలు పైలట్ల విశ్రాంతి సమయాన్ని పెంచుతున్నాయి.
కొత్త ప్రమాణాల ప్రకారం డీజీసీఏ గరిష్ఠ ఫ్లైట్ టైమ్‌ను రోజుకు 8 గంటలు, వారానికి 35 గంటలు, నెలకు 125 గంటలు, సంవత్సరానికి 1,000 గంటలుగా చెప్పింది. అదనంగా, క్రూ పూర్తిచేసిన ఫ్లైట్ డ్యూటీ వ్యవధి కంటే రెండింతల విశ్రాంతి పొందాలి. 24 గంటల్లో కనీసం 10 గంటల విశ్రాంతి తప్పనిసరి.
టెక్నికల్ సమస్యలు ఏంటి?
మంగళవారం ఢిల్లీ, పుణే, బెంగళూరు వంటి పెద్ద విమానాశ్రయాల్లో చెక్ ఇన్, డిపార్చర్ కంట్రోల్ వ్యవస్థల్లో లోపాలు చోటుచేసుకున్నాయి. దీని వల్ల అనేక ఎయిర్‌లైన్స్ విమానాలు ఆలస్యమయ్యాయి, క్యూలు పెరిగాయి.
శీతాకాలం వల్ల?
శీతాకాల పొగమంచు, ప్రయాణికుల రద్దీ, మెట్రో విమానాశ్రయాల్లో పీక్ అవర్ రద్దీ కారణంగా కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. ఇండిగో వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్‌లైన్ రోజుకు 2,200కు పైగా విమానాలు నడుపుతుంది. ప్రభుత్వ డేటా ప్రకారం ఆన్‌టైమ్ పనితీరు ఒక్కరోజులో 35%కి పడిపోయింది. అంటే 1,400కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి.
10టీవీతో మాజీ పైలట్ బాబీ ఏం చెప్పారు?
దీని గురించి 10టీవీతో మాజీ పైలట్ బాబీ మాట్లాడారు. “ఎన్నో కారణాలు ఉన్నాయి. వింటర్ సీజన్ కాబట్టి జనరల్లీ ఫాగ్ ఉంటుంది. కాబట్టి టేక్ ఆఫ్, లాండింగ్ కొంచెం డిలే చేస్తారు. ఇవి కూడా రీజన్‌లుగా ఉంటాయి. నాకు తెలిసిన విషయం ఏంటంటే.. లాస్ట్ వీక్ అమెరికాలో వన్ ఆఫ్ ది ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ బస్ పిచ్ డౌన్ ఆటోమేటిక్ అయిందన్నమాట.
అది ఎందుకు అయిందో వాళ్లకి కూడా తెలియదు. ఎయిర్ బస్ అనేది టోటల్లీ కంప్యూటర్స్ తోనే నడుస్తుంది. అయితే, ఈ ఆలస్యానికి సంబంధించి నిర్ధారించిన సమాచారం మాత్రం లేదు.
టెక్నికల్ ఇష్యూల విషయానికి వస్తే రెండు అంశాలు ముఖ్యంగా ఉంటాయి. ఎయిర్‌క్రాఫ్ట్ అనేది మొత్తం కంప్యూటర్స్ మీదనే నడుస్తుంది. ఇది మిషన్ మేడ్.. ఎప్పుడైనా ఏమైనా అవ్వచ్చు. అది ఒక రీజన్. రెండో విషయం ఏంటంటే మెయింటెనెన్స్ బాగా లేకపోవడం. ఈ రెండు రీజన్ల వల్లనే టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. కానీ, నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇష్యూ ఇలాక్ కంప్యూటర్‌లో ఉన్నట్టుంది” అని తెలిపారు.
लगातार तीसरे दिन 250 से ज्यादा इंडिगो फ्लाइट्स रद्द
क्रू की कमी को बताया वजह
जयपुर, इंदौर, मुंबई, दिल्ली में रातभर परेशान रहे हजारों यात्री#Indigo #FlightDelay@MoCA_GoI #इंडिगो @IndiGo6E #IndigoFlight #Indigo #FlightsCancelled pic.twitter.com/izeZn17QTR— Indian Observer (@ag_Journalist) December 4, 2025