బిల్ గేట్స్ తండ్రి కట్టెలు కొట్టేవాడా.. నిజమేంటి?

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, అమెరికన్ బిలియనీర్ బిల్ గేట్స్ అతని కూతురు ఫొబె అడెలెల ఫొటోలు వైరల్ గా మారాయి. బిల్ గేట్స్ ఓ రెస్టారెంట్‌లో భోజనం చేసి 5డాలర్లు టిప్‌గా ఇచ్చాడు. పుల్లలు కొట్టే వ్యక్తి కొడుకు కాబట్టే అలా ఇచ్చాడని కామెంట్లు మొదలయ్యాయి. 

అసలు కథేంటంటే.. భోజనం చేసి 5డాలర్లు టిప్ గా ఇవ్వడంతో వెయిటర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడట. ఏం జరిగిందని బిల్ గేట్స్ అడిగిన ప్రశ్నకు వెయిటర్.. పక్క టేబుల్ మీద కూర్చున్న మీ కూతురు 500డాలర్లు టిప్ గా ఇచ్చింది. మీరేమో ఇలా 5డాలర్లు ఇచ్చారని సమాధానమిచ్చాడు. దానికి స్పందించిన గేట్స్ నవ్వుతూ.. తను ధనికుడి కూతురు. నేనే మాత్రం కట్టెలు కొట్టేవ్యక్తికి కొడుకుని. మీ గతాన్ని ఎప్పుడూ మరవొద్దు. అదే నీ ఉత్తమ గురువు అని చెప్పాడట.

దీనిపై నిజాలు తెలుసుకునేందుకు ఓ ఇంగ్లీష్ మీడియా ఎంక్వైరీ చేసింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడి మీద చేసిన ప్రోత్సాహక కథాంశమే కానీ, ఇందులో నిజం లేదని తేలింది. బిల్ గేట్స్ రాసిన గేట్స్ నోట్స్ బ్లాగులో అతని తండ్రి విలియమ్ హెచ్ గేట్స్‌గా రాస్తూ అతనొక న్యాయవాదిగా పేర్కొన్నాడు.