Editors Guild: అమానుషమైన చర్య అంటూ కేంద్ర సర్కారుపై ఎడిటర్స్‌ గిల్డ్‌ మండిపాటు.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్

సర్కారుపై వచ్చే వార్తలపై ఫ్యాక్ట్ చెక్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమానుషమని, ఇది తమను కలవరపెడుతోందని ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా చెప్పింది. 

Editors Guild of India

Editors Guild: కేంద్ర సర్కారుపై ఆన్ లైన్ లో అసత్య వార్తలు రాకుండా నిరోధించడానికి ఫ్యాక్ట్‌ చెక్‌ పేరిట ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (PIB) ఆధ్వర్యంలో కొత్త విభాగం ఏర్పాటు కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. ఒకవేళ వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియాలో కేంద్ర ప్రభుత్వం గురించి ఏదైనా తప్పుడు వార్త రాస్తే ఆ ఫ్యాక్ట్ చెక్ట్ బృందం గుర్తిస్తుంది.

ఆ వార్తను లేదా పోస్టును తొలగించాలని ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం ఆయా వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా సంస్థలకు ఆదేశాలు పంపుతుంది. వార్తను పూర్తిగా తొలగించకపోతే ఆయా సంస్థలపై చర్యలు కూడా తీసుకుంటారు. దీంతో కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనపై ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా (Editors Guild of India) మండిపడింది.

ఫ్యాక్ట్ చెక్ విభాగాన్ని (fact-check unit) ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమానుషమని, ఇది తమను కలవరపెడుతోందని చెప్పింది. కేంద్ర ఐటీ శాఖ వెంటనే నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోవాలని, మీడియా సంస్థలతో సంప్రదింపులు జరపాలని ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా కోరింది. ఐటీ శాఖ ఇటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం పట్ల విచారం తెలుపుతున్నామని పేర్కొంది. ఫ్యాక్ట్ చెక్ విభాగానికి (fact-check unit) సంబంధించిన యంత్రాంగం గురించి వివరాలు కూడా తెలపకపోవడం పట్ల డిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

శ్రేయా సింఘాల్, యూనియన్ ఆఫ్ ఇండియా (Shreya Singhal v. Union of India) కేసులో 2015లో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేసింది. సాధారణ న్యాయ సూత్రాలకు కేంద్ర ప్రభుత్వ తీరు వ్యతిరేకంగా ఉందని చెప్పింది. సెన్షార్ షిప్ ను విధించే చర్యలా ఉందని తెలిపింది.

Ajit Pawar: ఏది పడితే అది రాస్తారా.. మీడియాపై అజిత్ పవార్ గరంగరం