షిర్డీ ఆలయం గురించి మీకు తెలియని విషయాలు

  • Publish Date - January 18, 2020 / 06:32 AM IST

అతి ముఖ్యమైన తీర్థ యాత్రల్లో షిర్డీ ఆలయం ఒకటి. భారత దేశంలో అత్యంత ప్రసిద్ధమైన ఆలయం. దేశ, విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడకు తరలివస్తుంటారు. ప్రధానంగా గురువారం విపరీతమైన రద్దీ ఉంటుంది. 36 వేల మందికిపైగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. షిర్డీలో వలస కూలీలకు, ఇతరులకు ఉపాధి కల్పిస్తుంది. సాధారణ దినాల్లో వేల సంఖ్యలో భక్తులు ఉంటే..పర్వదినాల్లో లక్షల్లో తరలివస్తుంటారు. విరాళాల రూపంలో కోట్ల రూపాయలు వస్తుంటారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో సాయిబాబా మందిరాలున్నాయి. అయితే..కొన్ని విషయాలు తెలియనవి..

1. షిర్డీకి ప్రతి రోజు 60 వేల మంది వస్తుంటారని అంచనా. వారాంతాల్లో ఈ సంఖ్య లక్షకు చేరుకుంటుంది. దసరా, గురుపూర్ణిమా, రామనవమి వంటి పర్వదినాల్లో భక్తుల సంఖ్య 5 లక్షలకు పైగా ఉంటుంది. 
2. ఆలయం ఒకప్పుడు ప్రైవేటు వారి చేతుల్లో ఉండేది. 1922లో నిర్మించబడింది. సాయిబాబాకు భక్తుడైన నాగ్ పూర్ నివాశి శ్రీమంత్ గోపాల్ రావ్ అనే లక్షాధికారి చేత ప్రారంభించబడింది. ప్రస్తుతం సాయిబాబా సంస్థాటన్ ట్రస్టు యాజమాన్యం చేతుల్లో నడుస్తోంది. 
3. భక్తులు సాయిబాబ ఆలయానికి భారీగా విరాళాలిస్తుంటారు. అందులో ధనికులు కూడా ఉంటారు. NASS COM సహా వ్యవస్థాపకులు కేవీ రమణి సాఫ్ట్ వేర్ సంస్థలను స్థాపించి సక్సెస్ ఫుల్‌గా నడిపిస్తున్నాడు. తనకు వచ్చిన డబ్బును షిర్డీకి విరాళంగా ఇస్తుంటారు. తన సంపాదనలో ఏకంగా 80 శాతం ట్రస్టుకు విరాళంగా ఇస్తున్నారు. 14 వేల మంది భక్తులకు వసతి కల్పించే విధంగా ఆశ్రమాన్ని నిర్మించడానికి 2012లో రూ. 110 కోట్ల విరాళం ఇచ్చారు. 
4. 1977లో వచ్చిన షిర్డీ కే సాయిబాబా సినిమాలో యాక్టర్ సుధీర్ దల్వి చక్కగా నటించాడు. ఈ సినిమా రికార్డులను బద్దలుకొట్టింది. ఇతను వీధుల్లో తిరుగుతుంటే..ఇతరులు ఆయన కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటుంటారు. బాబాగా ఆయన లీనమై నటించడమే ఇందుకు కారణం. 

 

5. 2010లో మాలిక్ ఏక్ చిత్రంలో జాకీ ష్రాఫ్ నటించారు. షిర్డీలో చిత్రం షూటింగ్ జరిగిన సమయంలో జాకీ సిగరేట్లు తాగడం, మద్యపానం చేసే వారు కాదు. 
6. షిర్డీలో ఎయిర్ పోర్టు అభివృద్ధి చేసేందుకు మలేషియా ప్రభుత్వం ఆసక్తి కనబరిచింది. ఈ క్రమంలో 2019 అక్టోబర్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం – మలేషియా ప్రభుత్వం మధ్య బిడ్ కుదిరింది. రూ. 1500 కోట్లతో ఎయిర్‌ పోర్టును అభివృద్ధి చేయనుంది. 
7. షిర్డీకి చేరుకొనేందుకు అనేక ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యం ఉంది. 2009 మార్చిలో సాయినగర్ షిర్డీ సెంట్రల్ రైల్వే అందుబాటులోకి వచ్చింది. ఇదొక ప్రధాన టెర్మినల్. కోల్ కతా, పూరీ వంటి దూర ప్రాంతాలకు రైళ్లు నడుస్తున్నాయి. ప్రతి ఆదివారం సాయినగర్ షిర్డీ నుంచి బయలుదేరి పూరీకి 1, 619 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది. ఇందుకు 29 గంటలు పడుతుంది. సాయినగర్ షిర్డీ – కోల్ కతా హౌరా జంక్షన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు కోల్ కతా హౌరా జంక్షన్‌కు 1, 790 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇందుకు 26 గంటల సమయం పడుతుంది. 
8. 2011 జనాభా లెక్కల ప్రకారం షిర్డీ యొక్క సగటు అక్షరాస్యత 70 శాతం గా ఉంది. ఇందులో పురుషులు 76 శాతం, స్త్రీలు 62 శాతంగా ఉన్నారు. జాతీయ సగటు అక్షరాస్యత రేటు 59.5 గా ఉంది. 

Read More : దర్శనానికి వెళ్లొచ్చు : షిర్డీ ఆలయం మూసివేయడం లేదు