Fake hospital: కొవిడ్ బెడ్లతో ఫేక్ హాస్పిటల్ నడుపుతూ.. తనను చూసి గర్వించాలంటోన్న వ్యక్తి అరెస్ట్
ఫేక్ హాస్పిటల్ నడుపుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా కొవిడ్ చెలరేగుతున్న క్రమంలో 30 బెడ్ లు ఏర్పాటు చేసి ఓ ఫేక్ ఫెసిలిటీ సెంటర్లో ట్రీట్మెంట్ అందిస్తున్న ...

Fake Hospital
Fake hospital: ఫేక్ హాస్పిటల్ నడుపుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా కొవిడ్ చెలరేగుతున్న క్రమంలో 30 బెడ్ లు ఏర్పాటు చేసి ఓ ఫేక్ ఫెసిలిటీ సెంటర్లో ట్రీట్మెంట్ అందిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రాజేందర్ సింగ్ అనే వ్యక్తిగా గుర్తించారు.
ఫేక్ హాస్పిటల్ గురించి జిల్లా అడ్మినిస్ట్రేషన్ కు రిపీటెడ్ కంప్లైంట్స్ వస్తున్నాయని యాక్షన్ తీసుకుంది. బర్మార్ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ కుసుంలత మే15న ఈ మేర కంప్లైంట్ తీసుకున్నారు.
బర్మర్ లోని కుసీప్ గ్రామంలో దీనిని నిర్వహిస్తున్నట్లుగా తెలిసింది. సివానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండటంతో ఆ ప్రాంత పట్వారీతో కలిసి కుసుంలత స్పాట్ కు రెవెన్యూ టీంను తీసుకుని వెళ్లారు.
అక్కడ ఓ టెంట్ కింద కొవిడ్-19 పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆ టెంట్ కిందనే 30-35 బెడ్లతో కొవిడ్-19 గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నాడు. అక్కడ ఆక్సిజన్ సిలిండర్ కూడా ఉండటం గమనార్హం.
యాక్షన్ తీసుకోబోతుండగా ఆమెపై దాడి చేస్తామని బెదిరించారు. పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తున్నందుకు గొప్పగా భావించాలి కానీ, ఇలా చేయకూడదని అన్నాడు. తాను డాక్టర్ ని అని, సంబంధించిన డిగ్రీ ఉందని, హాస్పిటల్ రన్ చేసే లైసెన్స్ కూడా ఉందని చెప్పుకొచ్చాడు. అధికారితో తప్పుగా ప్రవర్తించడంతో పోలీసులను పిలిపించి అతనిపై యాక్షన్ తీసుకున్నారు.